తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా మహానటి సావిత్రిని మించిన నటీమణులు ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎవరూ రాలేదు. సావిత్రిపై తెలుగు ప్రజలకు ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానం ఉంది అనటానికి ఆమె పేరుతో వచ్చిన బయోపిక్ సూపర్ హిట్ కారణం. అప్పుడు ఇప్పుడు అని తేడా లేకుండా ఎంతో మంది అభిమానులు సావిత్రికి ఉన్నారు. అందంతో మాత్రమే కాకుండా అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సావిత్రి అప్పట్లో తెలుగు – తమిళ భాషల్లో తిరుగులేని స్టార్ హీరోయిన్. ఆమె పక్కన నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఇష్టపడేవారు.
అందుకే నిర్మాతలు సావిత్రి కాల్షీట్ల కోసం క్యూ కట్టేవారు. ఒకానొక టైంలో సావిత్రికి వరుసగా ఆఫర్లు రావడంతో ఆమె రోజుకు రెండు షిఫ్టులు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతో వెలుగు వెలిగిన సావిత్రి తన కెరీర్ను చివర్లో ఎంతో దీనస్థితిలో చనిపోవడం బాధాకరం. ఈ క్రమంలోనే సావిత్రి సంబంధించి పలు విషయాలను బయటపెట్టారు ప్రియా చౌదరి. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో సావిత్రి తన జీవితంలో చేసిన తప్పులు ఆమెను కోలుకోలేని దెబ్బ తీయడంతో పాటు ఆమె కెరీర్ను ముగించేశాయి అని ప్రియా చౌదరి చెప్పింది.
అప్పట్లో సావిత్రి హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేదట. ఆమెకు డబ్బులు ఇచ్చేందుకు నిర్మాతలు డబ్బుల్లో సంచుల్లో వేసుకుని కారులో ఆమె ఇంటికి తీసుకు వెళ్లేవారట. అప్పట్లోనే ఎన్నో ఆస్తులు కూడబెట్టిన సావిత్రి కెరీర్ చివర్లో మాత్రం చేతిలో చిల్లిగవ్వ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లకు పడగలెత్తిన సావిత్రి సంపాదన పట్ల ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండేదట. ఆమె చేతికి ఎముక లేదు అన్నట్టుగా విరివిగా దానం చేసేవారట. అలా ఆమె సంపాదించిన ఆస్తి ఎంత హారతి కర్పూరంలా కరిగిపోయింది.
సావిత్రి సినిమాల్లోకి పెదనాన్న తీసుకువచ్చారు. ఆమె రెమ్యునరేషన్ కూడా ఆయన డిసైడ్ చేసేవారట. అయితే సావిత్రి తన పెదనాన్నను కాదని సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలోనే అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న హీరో శివాజీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. అప్పటికే శివాజీకి ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు కూడా ఉన్నాయి. శివాజీ గణేషన్ మైకంలో సావిత్రి పడిపోయింది. ఆ తర్వాత తన జీవితం మీద శివాజీ గణేషన్ డామినేషన్ పెరగడంతో పాటు… సావిత్రిని నమ్మిన వాళ్లు మోసం చేశారు. అలా ఆమె ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. చివరకు ఆమె అత్యంత దయనీయ స్థితిలో మృతి చెందడం బాధాకరం.