ఆమె అప్పట్లో ఓ క్రేజీ హీరోయిన్… ఆమె ఓ స్టార్ హీరో మాయలో పడిపోయింది. అతడికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా కానీ అతడినే నమ్మి సహజీవనం చేసింది. ఐదుగురు పిల్లల తల్లి అయ్యింది. ఆమె జీవితం చివరకు త్యాగాల మయం అయ్యింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పుష్పవల్లి (అలనాటి బాలీవుడ్ ప్రముఖ నటి రేఖ తల్లి), ఆ స్టార్ హీరో ఎవరో కాదు జెమిని గణేషన్. జెమినీకి ముందే పెళ్లయ్యిందని తెలిసి కూడా సావిత్రి అతడి వలలో పడింది. జెమినీ సావిత్రిని 1952లో పెళ్లి చేసుకున్నాడు. సావిత్రితో పెళ్లి కాకముందే జెమినీతో రిలేషన్ లో ఉన్న పుష్పవల్లి ఆ తర్వాత కూడా అతడితో పిల్లలను కంది. అది కూడా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు పిల్లలు. ఓవరాల్‌గా పుష్పవ్లలిది ప్రేమ, తెగువ, త్యాగాల జీవితం.
పుష్పవల్లిగా ప్రసిద్ధమైన కందాళ వెంకట పుష్పవల్లి తాయారు పశ్చిమగోదావరి జిల్లా- తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన జన్మించింది. ఆమె తల్లిదండ్రులు కందాళ తాతాచారి, రామకోటమ్మ. ఆమె ఐదో తరగతి వరకే చదువుకున్నా కూడా చిన్న వయస్సు నుంచే అందం, నాట్యం ద్వారా ఎంతోమంది మనస్సులు గెలిచింది. మొదటిసారిగా సంపూర్ణ రామాయణం సినిమాలో సీతం వేషం వేసింది. ఆ తర్వాత వరుసగా దశావతారములు సినిమాలో మోహిని, మాయ శశిరేఖ పాత్రల్లో నటించి ఔరా అనిపించింది.
ఇక పుష్పవల్లి చెల్లి సూర్యప్రభ కూడా హీరోయిన్‌గా చేసింది. ఆమె ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్యను పెళ్లాడింది. ఇక జెమినీ గణేష్‌ను ప్రేమించడానికి ముందు పుష్పవల్లి రంగాచారి అనే వ్యక్తిని పెళ్లాడింది. అతడితో విడిపోయాక.. అది కూడా జెమినీ సావిత్రిని పెళ్లి చేసుకున్నాక కూడా పిల్లలను కంది. మొత్తం ఐదుగురు పిల్లలు బాబ్జీ, భానురేఖ (బాలీవుడ్ నిన్నటి తరాల హీరోయిన్ రేఖ), రమ, రాధ, ధనలక్ష్మిలను జెమినీ పట్టించుకోకపోయినా కూడా తానే అన్నీ కష్టపడి పెంచింది. ఇక ప్రేమతో పాటు పిల్లల కెరీర్‌కోసం జీవితాన్ని ఫణంగా పెట్టిన పుష్పవల్లి 1992 మే 11న, తన 66 వ ఏట కన్నుమూసింది.