టాలీవుడ్ కింగ్ నాగార్జున – యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబోలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్‌లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా అదే కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ బంగార్రాజు సినిమా తెరకెక్కింది. నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.
నాగార్జున సరసన రమ్యకృష్ణ, చైతు పక్కన యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లతో పాటు ట్రైలర్లు కూడా సినిమాపై అంచనాలు పెంచేచశాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడం కలిసి వచ్చాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రు 38.15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది నాగార్జున కెరీర్‌లో హయ్యస్ట్ గా రికార్డులకు ఎక్కింది.
బంగార్రాజు వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ ( రూ. కోట్లలో)
నైజాం : 11 కోట్లు
సీడెడ్ : 6 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.05 కోట్లు
ఈస్ట్ : 2.8 కోట్లు
వెస్ట్ : 2.6 కోట్లు
గుంటూరు : 3.20 కోట్లు
కృష్ణా : 2.70 కోట్లు
నెల్లూరు : 1.45 కోట్లు
———————————————–
ఏపీ + తెలంగాణ టోటల్ = 33.80 కోట్లు
———————————————–
కర్నాటక + రెస్టాఫ్ ఇండియా : 2.15 కోట్లు
ఓవర్సీస్ : 2.20 కోట్లు
——————————————-
వరల్డ్‌వైడ్ బిజినెస్ : 38.15 కోట్లు
——————————————
ఏపీ, తెలంగాణలో రు. 33.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్‌గా రు. 38 కోట్ల బిజినెస్ చేసింది. నాగార్జున కెరీర్‌లో ఇదే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్. ఇక సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతికి నాలుగు సినిమాల పోటీలో వచ్చి రు. 55 కోట్ల పై చిలుకు షేర్ రాబట్టింది. మరి ఇప్పుడు బంగార్రాజు ఏం చేస్తారో ? చూడాలి.