అఖండ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టాక బాలయ్య – బోయపాటి కాంబినేషన్ గురించి రకరకాలుగా మాట్లాడుకున్న వాళ్లంతా నోటికి తాళాలు వేసేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చింది. తీరా సినిమా హిట్ అయ్యాక.. ఏకంగా బాలయ్య కెరీర్లోనే ఎప్పుడూ లేనట్టుగా రు. 150 కోట్ల థియేట్రికల్ వసూళ్లు రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. గతంలో బాలయ్య – బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్ సినిమాలు వచ్చాయి.
అయితే వినయ విధేయ రామ తర్వాత చాలా మంది బోయపాటి పనైపోయిందన్న ప్రచారం చేశారు. అయినా బోయపాటి ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని సరైన టైంలో బాలయ్యతో అఖండ చేసి అటు బాలయ్యకు, ఇటు తన ఖాతాలో తిరుగులేని హిట్ వేసుకున్నాడు. ఇక బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే క్రేజీ కాంబినేషన్ అన్నది ఫ్రూవ్ చేశాడు.
అఖండ తర్వాత బోయపాటికి మళ్లీ పెద్ద బ్యానర్ల నుంచి అడ్వాన్స్‌లు ఇస్తామన్న ఆఫర్లు ఉన్నాయి. సితార సంస్థ ఇప్పటికే బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చింది. అటు మైత్రీ మూవీస్ వాళ్ల నుంచి కూడా బాలయ్య అడ్వాన్స్ అందుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరో సెట్ కావాల్సి ఉంది. ఇక బోయపాటితో సినిమా చేసేందుకు యంగ్ హీరో రామ్ ఒకడు లైన్లో ఉన్నాడు.
ఇక బాలయ్య లైనప్‌లో ప్రస్తుతం మలినేని గోపీచంద్, అనిల్ రావిపూడి ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అయ్యేలోగా మళ్లీ బాలయ్య – బోయపాటి సినిమాయే ఫిక్స్ అవుతుందని అంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల టైంకు ముందు లేదా అంతకంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ జరుగుతోంది. అయితే మైత్రీ వాళ్లో లేదా అనిల్ రావిపూడి నిర్మాతగానో ఈ సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ?