యువరత్న, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా అఖండ. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య మురళీకృష్ణ అనే రైతు పాత్రతో పాటు అఘోరా క్యారెక్టర్‌లో నటించాడు. డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటేనే సింహా – లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు గుర్తుకు వస్తాయి.
ఆ బ్లాక్ బస్టర్లకు ఏ మాత్రం తీసిపోకుండా అఖండ సూపర్ హిట్ అయ్యింది. థియేటర్లో విజయవంతంగా 50 రోజుల రన్ పూర్తి చేసుకున్న అఖండ వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ షేర్ రు. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక నాన్ థియేట్రికల్ వసూళ్లతో కలిపితే ఈ సినిమా వసూళ్లు రు. 200 కోట్లు పైమాటే. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన అఖండ ఓటీటీలోకి రావడంతోనే రికార్డుల వేట స్టార్ట్ చేసేసింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి 24 గంటలు అవ్వకుండానే ఏకంగా 1 మిలియన్ స్ట్రీమింగ్స్ ఈ సినిమాకు దక్కాయట. గతంలో ఏ సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. బాలయ్య సినిమాలో చెప్పినట్టు బోల్డోజర్‌లా బ్రేకుల్లేకుండా పాత రికార్డులను గుద్దుకుంటూ వెళ్లిపోతున్నాడు.
ఇక థియేటర్లలో అఖండ పూనకాలతో ప్రేక్షకులు ఎలా ఊగిపోయారో ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే రికార్డుల వేటతో స్టార్ట్ అయ్యింది. ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.