నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ బ్లాక్‌బస్టర్ హిట్ అయినా కూడా ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. మరోవైపు అఖండ వచ్చాక పుష్ప – శ్యామ్‌సింగరాయ్ సినిమాలు పోటీలో ఉన్నా కూడా అఖండ ఇంకా థియేటర్లలో మంచి షేర్ రాబడుతుండడం విశేషం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
రు. 54 కోట్ల షేర్‌తో బాక్సాఫీస్ రన్ స్టార్ట్ చేసిన అఖండ ఐదో వారం ముగిసే సరికే రు. 71.60 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు ఇప్పటికే రు. 17 కోట్ల పై చిలుకు లాభాలు వచ్చాయి. సీడెడ్, నైజాం ఏరియాలో అయితే అఖండకు భారీ లాభాలు దక్కాయి. 6వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఇంకా చాలా థియేటర్లలో స్టడీగా వసూళ్లు రాబడుతోంది. ఇక అఖండ రు. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో అఖండ మరో అదిరిపోయే రికార్డు సాధించడంతో పాటు బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ రు. 150 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కింది.
అఖండ 5 వారాల వసూళ్లు ఇలా ఉన్నాయి…
నైజాం – 20.50 కోట్లు
సీడెడ్ – 15.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.22 కోట్లు
ఈస్ట్ – 4.18 కోట్లు
వెస్ట్ – 3.96 కోట్లు
గుంటూరు – 4.78 కోట్లు
కృష్ణా – 3.60 కోట్లు
నెల్లూరు – 2.63 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ = 61.30 కోట్లు
————————————————–
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ = 10.30 కోట్లు
——————————————————-
వరల్డ్ వైడ్ వసూళ్లు = 71.60 కోట్లు
—————————————————