Moviesఆ రికార్డు సౌత్ ఇండియాలో ' బాల‌య్య ' ఒక్క‌డిదే... '...

ఆ రికార్డు సౌత్ ఇండియాలో ‘ బాల‌య్య ‘ ఒక్క‌డిదే… ‘ లెజెండ్ ‘ కే ఆ ఘ‌న‌త సొంతం..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ , మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాలు అన్ని సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. 2010లో వ‌చ్చిన సింహా సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత 2014లో వ‌చ్చిన లెజెండ్ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌.. ఇక తాజాగా వ‌చ్చిన అఖండ సైతం సూప‌ర్ హిట్ అయ్యింది. అఖండ బాల‌య్య కెరీర్‌లో తొలి రు. 100 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్క‌డంతో పాటు ఏకంగా రు. 150 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కూడా కొల్ల‌గొట్టేసింది.

ఇక బాల‌య్య లెజెండ్ సినిమా సౌత్ ఇండియాలోనే ఏ హీరోకు లేని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. ఆ రోజుల్లోనే రు. 40 కోట్ల పై చిలుకు షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా వ‌చ్చినాడు … టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో మాంచి జోష్ నింపింది. లెజెండ్ సినిమా వ‌చ్చాక 2014 సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఘ‌న‌విజ‌యం సాధించి.. ఏపీలో అధికారంలోకి వ‌చ్చింది.

ఇక లెజెండ్ సినిమాను రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌తో పాటు అనిల్ సుంక‌ర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్ప‌ణ‌లో వారాహి చల‌నిచిత్రం, 14 రీల్స్ సంస్థ‌లు క‌లిసి ఈ సినిమాను నిర్మించాయి. బాల‌య్య ప‌క్క‌న రాధికాఆఫ్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా రెండు కేంద్రాల్లో 400 రోజులు ఆడింది.

ఈ రెండు కేంద్రాలు కూడా రాయ‌ల‌సీమ‌లోనే ఉన్నాయి. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు మినీ శివ‌తో పాటు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో 400 రోజులు ఆడింది. ఇక ప్రొద్దుటూరులో అర్చన థియేట‌ర్లో అయితే ఏకంగా 1000 రోజులు దాటేసి ఆడింది. ద‌క్షిణ భార‌త సినిమా చ‌రిత్ర‌లో ఓ హీరో సినిమా ఒకే సెంట‌ర్లో ఇన్ని రోజులు ఆడ‌డం మ‌రే స్టార్ హీరోకు లేదు. నాలుగు అంకెల ప్ర‌ద‌ర్శ‌న చూసిన తొలి ద‌క్షిణ భార‌త సినిమాగా లెజెండ్ రికార్డుల‌కు ఎక్కితే.. ఆ అరుదైన ఘ‌న‌త బాల‌య్య‌కే ద‌క్కింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news