యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా విజయవంతంగా ఐదోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని థియేటర్లలో మంచి షేర్ నడుస్తోంది. అఖండ తర్వాత పుష్పతో పాటు నాని శ్యామ్‌సింగరాయ్ సినిమాలు వచ్చాయి. ఏపీలో చాలా థియేటర్లు మూసి వేశారు. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర అఖండ జోరు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే అఖండ నైజాం ఏరియాలో అదిరిపోయే రికార్డు సొంతం చేసుకుంది.
బాలయ్య నైజాంలో ఆల్ టైం రికార్డు వసూళ్లు సాధించింది. బాలయ్య సినిమాలకు మామూలుగా నైజాంలో మార్కెట్ తక్కువుగా ఉంటుంది. అక్కడ బాలయ్య శాతకర్ణి సినిమా మాత్రమే రు.10 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఇప్పుడు అఖండ ఏకంగా రు. 20 కోట్ల షేర్‌కు చేరువైంది. అఖండ సినిమాను నైజాంలో రు. 11 కోట్లకు అమ్మారు. అయితే ఇప్పుడు లాంగ్‌రన్‌లో ఏకంగా రు. 20 కోట్ల షేర్ కొల్లగొట్టడంతో అక్కడ ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.
గతంలో బాలయ్య సినిమాలు హిట్ అయినా కూడా నైజాంలో రు. 10 కోట్ల వసూళ్లు ఎప్పుడూ రాలేదు. అలాంటిది అఖండ ఏకంగా రు. 20 కోట్ల షేర్ రాబట్టడంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. అఖండ ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అయితే నైజాంలో మాత్రం ఏకంగా డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. నైజాంలో కూడా బాలయ్యకు తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉందని అఖండ ఫ్రూవ్ చేసింది.
ఏపీలోనూ అఖండకు మంచి వసూళ్లే వచ్చాయి. అయితే ఏపీలో టిక్కెట్ రేట్లు మరీ తక్కువుగా ఉండడంతో ఇక్కడ కాస్త తక్కువ లాభాలు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో అయితే ఈ సినిమాకు మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.