సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, యంగ్ హీరో ధనుష్ విడాకుల ప్రకటన కోలీవుడ్‌తో యావత్ సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. రజనీ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య డైరెక్టర్‌గానే కాకుండా… నేపథ్య గాయనిగా కూడా ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ఓ సినిమా ప్రమోషన్లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా ధనుష్‌తో ఏర్పడిన పరిచయం తక్కువ టైంలోనే ప్రేమగా మారడంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. 2004 నవంబర్ 18న వీరిద్దరి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
పెళ్లయ్యే సమయానికి ధనుష్ వయస్సు 21 కాగా, ఐశ్వర్య వయస్సు 23. ఐశ్వర్యతో పోలిస్తే ధనుష్ 2 సంవత్సరాలు చిన్నోడు. అయితే అప్పటికే ఐశ్వర్యకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే ధనుష్‌నే చేసుకుంటానని ఐశ్వర్య పట్టుబట్టడంతో పాటు కాస్త దగ్గర బంధుత్వం కూడా ఉండడంతో రజనీ ఆమె కోరిక ను కాదన లేకపోయాడు.
మధ్యలో సుచీలీక్స్ వ్యవహారం బయటకు వచ్చాక.. శృతీహాసన్, అమలాపాల్‌తో అతడికి ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినప్పుడే వాళ్లు విడిపోతారని అనుకున్నారు. అయితే రజనీ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వీరు కలిసి ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరు విడాకులు తీసుకోక తప్పలేదు. కేవలం ధనుష్‌కు, హీరోయిన్లతో ఎఫైర్లు ఉండడంతోనే వీరు విడిపోవాల్సి వచ్చిందన్న ప్రచారం ఎక్కువుగా జరుగుతోంది.
అయితే ఐశ్వర్యకు కూడా ధనుష్‌తో పెళ్లికి ముందు మరో హీరోతో ఎఫైర్ ఉందన్న ప్రచారం అప్పట్లో జరిగేది. ఆ హీరో ఎవరో కాదు శింబు.. ధనుష్‌తో ప్రేమకు ముందు ఐశ్వర్య శింబుతో ప్రేమలో ఉందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వచ్చాయి. ఈ ప్రేమ వార్తలు తెలిసి రజనీ డిజప్పాయింట్ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో గాని ఐశ్వర్య, శింబుకు దూరమైంది. ఇక శింబు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడన్న వార్తలు తెలిసిందే.