సినిమా ఇండస్ట్రీకి వచ్చే వారిలో ఎక్కువ మంది బ్యాక్‌గ్రౌండ్‌తోనే వస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్లుగా నిలదొక్కుకుంటారు. ఇక కొందరు హీరోలతో పాటు దర్శకులు సైతం ఉన్నత చదువులు చదివి ఇండస్ట్రీలోకి వస్తుంటారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. వారి ఇండస్ట్రీలో ఉన్న మెకానికల్ ఇంజనీర్లు ఎవరో చూద్దాం.
1. అక్కినేని నాగార్జున:
టాలీవుడ్లో ఏఎన్నార్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు కింగ్ నాగార్జున. అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన నాగార్జున విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే నాగార్జునకు పెళ్లయ్యింది.
2. గౌతమ్ మీనన్ :
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ సైతం మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. గౌతమ్ మీనన్ కోలీవుడ్‌లో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్లు ఇచ్చాడు.
3. శేఖర్ కమ్ముల :
సునిశితమైన ప్రేమకథలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. ఫిదా, తాజాగా లవ్‌స్టోరీ సినిమాతో శేఖర్ కమ్ముల తన మార్క్ ఏంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో కొద్ది రోజుల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌గా పనిచేసిన శేఖర్ ఇండియాకు వచ్చాక సినిమాల్లోకి వచ్చారు.
4. కార్తీ:
బీటెక్ చదివాక కొద్ది రోజులు ఉద్యోగం చేశాడు కోలీవుడ్ హీరో కార్తీ. అటు తండ్రి సినిమాల్లో ఉండడం.. ఇటు అన్న సూర్య స్టార్ హీరోగా ఉండడంతో సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి 30 ఏళ్లు దాటాక హీరో అయ్యాడు.
5. అవసరాల శ్రీనివాస్ :
అవసరాల శ్రీనివాస్ అష్టాచమ్మా సినిమాతో నటుడిగా మారాడు. అంతకుముందే అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేసేవాడు. ఇక హీరో అవ్వడంతో పాటు ఇప్పుడు దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు.
6. నవీన్ చంద్ర:
బీటెక్ పూర్తిచేసిన నవీన్‌చంద్ర ఉద్యోగం లేక కొద్ది రోజుల పాటు హోటల్లో కూడా పనిచేశాడు. ఆ తర్వాత అందాల రాక్షసి సినిమాతో హీరోగా మారాడు.
7. తరుణ్ భాస్కర్:
పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన దర్శకుడు తరుణ్ భాస్కర్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మెకానికల్ ఇంజనీరింగే. మనోడు దర్శకుడు మాత్రమే కాదు. మంచి నటుడు కూడా..!