Moviesతండ్రి వ‌య‌స్సున్న హీరోతో ఘాటు రొమాన్స్‌తో పిచ్చెక్కించిన కుర్ర‌ హీరోయిన్‌..!

తండ్రి వ‌య‌స్సున్న హీరోతో ఘాటు రొమాన్స్‌తో పిచ్చెక్కించిన కుర్ర‌ హీరోయిన్‌..!

స్టార్ హీరోలు ఐదారు ప‌దుల వ‌య‌స్సులో కూడా హీరోయిన్లు దొర‌క్క కుర్ర హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో వీరి జంట‌ను తెర‌మీద చూసేందుకు కాస్త ఎబ్బెట్టుగానే ఉంటోంది. అందుకే సీనియ‌ర్ హీరోలు, కుర్ర హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసే విష‌యంలో బాగా ఇబ్బంది ప‌డుతున్న‌ట్టుగానే ఉంది. సౌత్ ఇండియాలో టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌, మ‌ల్లూవుడ్ వ‌ర‌కు 60 ఏళ్ల సీనియ‌ర్ హీరోలు ఎక్కువుగా ఉన్నారు. వీరికి హీరోయిన్లు దొర‌క్క నిండా 25 ఏళ్లు లేని కుర్ర హీరోయిన్ల‌తోనే రొమాన్స్ చేయాల్సి వ‌స్తోంది.

 

అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సీనియ‌ర్ హీరోలు, కుర్ర హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బీ టౌన్ హీరోలు త‌మ కూతురు వ‌య‌స్సు ఉన్న కుర్ర హీరోయిన్ల‌తో ఘాటు రొమాన్స్ చేసేందుకు కూడా వెనుకాడ‌డం లేదు. అక్క‌డ జ‌నాలు కూడా ఆ రొమాన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సీనియ‌ర్ హీరో అక్ష‌య్ కుమార్‌, కుర్ర హాట్ బ్యూటీ సారా ఆలీఖాన్ క‌లిసి ఇప్పుడు అత్రంగి సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ స‌న్నివేశాలు పీక్స్‌లో ఉన్నాయ‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన పాట‌లు, ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ వీడియోల‌ను చూస్తుంటే ఇద్ద‌రి మ‌ధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సారా కుర్ర హీరోలతోనే న‌టించింది. అయితే ఇప్పుడు అక్ష‌య్ ప‌క్క‌న అంటే.. అక్ష‌య్ వ‌య‌స్సులో దాదాపు త‌న తండ్రి వ‌య‌స్సుతో స‌మాన‌మైన వ్య‌క్తి.

అయినా కూడా అక్ష‌య్‌తో ఘాటైన కెమిస్ట్రీ పండించింద‌ట‌. ఈ సినిమాలో మ‌రో హీరోగా ధ‌నుష్ న‌టించాడు. ఈ వారంలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఇప్పుడు అక్ష‌య్ – సారా రొమాన్స్ గురించే నేష‌న‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సినిమాలో సారా ముందుగా ధ‌నుష్‌ను పెళ్లి చేసుకుంటుంది. ఆ త‌ర్వాత భ‌ర్త అంటే ఇష్టం లేక అక్ష‌య్‌పై మోజు ప‌డుతుంది.

అక్ష‌య్ త‌న కంటే వ‌య‌స్సులో పెద్ద వాడు అయినా కూడా అత‌డితోనే కెమిస్ట్రీ కోరుకుంటుంది. ఈ క‌థ‌లో చివ‌రి ట్విస్ట్ ఏంట‌న్న‌దే ఆస‌క్తిగా ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇక అక్ష‌య్‌తో సారా రొమాన్స్ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ లేద‌ట‌. మ‌రి వీరి ఘాటు రొమాన్స్ వెండితెర‌పై ఎలా మ‌త్తెక్కించిందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news