లేడి సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఎప్పటికప్పుడు తన సినిమాలతో వార్తల్లో నిలిచే నయనతార అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. పెళ్లి విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతున్న నయన్..ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం నడిచింది.
ప్రముఖ తమిళ దర్శకుడుతో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని, వారిద్దరూ చాలా తొందరగా తొందరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాని తాజా సమాచారం ప్రకారం ..అమ్మడు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందట. ఇక దీనిపై విఘ్నేష్ ఫ్యామిలీ కాస్త అసంతృప్తిగానే ఉన్నారని టాక్. విఘ్నేష్ శివన్‌తో కలిసి చెట్టా పట్టాలు వేయడం, కలిసి పండుగలు చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు.
ఇక అమ్మడు పెళ్లి తరువాత తన భర్త తో కలిసి ఉండటానికి చెన్నై నగరంలో కొత్త ఇంటిని కొన్నారట. ప్రజెంట్ ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న నయనతార పెళ్ళి తరువాత డైరెక్ట్ గా కొత్త ఇంటికి మకాం మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోయస్ గార్డెన్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
కోలీవుడ్ బడా సెలబ్రిటీస్ అయిన రజనీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోల ఇల్లు ఉన్న ఈ ఏరియాలో కాబోయే భర్తతో నివసించాలని ఆమె ప్లాన్ చేసుకుంటోందట. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఇంటిలో నాలుగు బెడ్ రూమ్స్..ఖరీదైన ఇంటీరియర్‌తో ఆ ఇంటిని మరింత ముస్తాబు చేయిస్తోందట నయన్. ఈ ఇంటి కోసం నయన్ కోట్లు ఖర్చు పెట్టిన్నత్లు తెలుస్తుంది. పెళ్ళి తరువాత విగ్నేష్ శివన్‌తో కలిసి ఆమె గృహ ప్రవేశం చేయబోతున్నారని తెలుస్తోంది.