నందమూరి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కు యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తున్నాం.. సినిమా యావరేజ్‌గా ఉన్నా కూడా ఎన్టీఆర్ తన భుజస్కంధాల మీద వేసుకుని మోసుకువెళుతూ సినిమాలు హిట్ చేస్తున్నాడు. టెంపర్ – జైలవకుశ – నాన్నకుప్రేమతో-అరవిందసమేత ఈ సినిమాలు అన్ని కూడా ఓ మోస్తరు టాక్ వచ్చినవే. అయితే ఇవన్నీ ఎన్టీఆర్ క్రేజ్, ఛరిష్మాతోనే హిట్ అయ్యాయి.
ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చాక వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. పెద్దగా గ్యాప్ రాలేదు. 2013 నుంచి తీసుకుంటే ఈ యేడాది బాద్ షా, రామయ్యా వస్తావయ్య సినిమాలు చేశాడు. 2014లో రభస – 2015లో టెంపర్ – 2016లో నాన్నకుప్రేమతో, జనతా గ్యారేజ్ – 2017లో జైలవకుశ – 2018లో అరవింద సమేత వీరరాఘవ ఇలా ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తూ ఫ్యాన్స్‌లో ఆ జోష్ అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.
ఒకానొక టైంలో మహేష్‌బాబు 2007 నుంచి 2010 వరకు మూడు సంవత్సరాలు సినిమాలు చేయలేదు. అప్పుడు ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయిపోయారు. అలాంటి గ్యాప్ ఎన్టీఆర్‌కు ఎప్పుడూ రాలేదు. అయితే అరవింద తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి చేతిలో చిక్కుకుపోయారు. ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్నదానికంటే ఎక్కువ టైం తీసుకోవడం.. మధ్యలో రెండు, మూడుసార్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాక కూడా వాయిదా వేయడం.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రావడం.. రాజమౌళి పర్‌ఫెక్షన్ ఇలా ఇవన్నీ ఆర్ ఆర్‌ను అనుకున్న దానికంటే బాగా ఆలస్యం అయ్యేలా చేశాయి.
రేపు ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో, నార్త్‌లో నైట్ కర్ప్యూలు ఉండడంతో సంక్రాంతికి అయినా ఈ సినిమా వస్తుందా ? అన్న చిన్న సందేహం కూడా ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ 2018 తర్వాత వరుసగా మూడు క్యాలెండర్ ఇయర్‌లో సినిమాలు చేయలేకపోయాడు. 2019-2020-2021 ఇలా మూడు సంవత్సరాల్లో సినిమాలు రాలేదు. 20 ఏళ్ల ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక్క 2009లో మినహా ఏ సంవత్సరంలోనూ ఎన్టీఆర్ సినిమా లేకుండా లేదు. అలాంటిది ఇప్పుడు మూడేళ్లుగా ఎన్టీఆర్ సినిమాలు లేకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.
ఎంత కరోనా ఉన్నా కూడా బన్నీ గతేడాది అలవైకుంఠపురంలో, ఈ యేడాది పుష్పతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్, పవన్ సినిమాలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ సినిమా మాత్రం ఈ మూడేళ్లలో లేదు. ఎన్టీఆర్‌తో విధి ఇలా ఆటలు ఆడుకుంటోందని .. సంక్రాంతికి అయినా ఆర్ ఆర్‌తో తిరుగులేని రికార్డులు కొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.