Moviesసీనియ‌ర్ హీరోయిన్లు కుర్ర హీరోల‌ను ఎందుకు పెళ్లాడ‌తారు.. ఆ టాప్ సీక్రెట్...

సీనియ‌ర్ హీరోయిన్లు కుర్ర హీరోల‌ను ఎందుకు పెళ్లాడ‌తారు.. ఆ టాప్ సీక్రెట్ ఇదే…!

సినిమా రంగంలో ఉన్న హీరోలు, హీరోయిన్లు వయసులో తమ కంటే చిన్న హీరోలతో ప్రేమలో పడటం డేటింగ్ చేయడం… తర్వాత పెళ్లి చేసుకోవడం ఎప్పటినుంచో ఉంది. 1990వ ద‌శ‌కంలో సైఫ్ అలీఖాన్ – అమృతారావు, ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ తాజాగా ప్రియాంకా చోప్రా – నిక్‌, ఇక ఇప్పుడు కత్రినాకైఫ్ – విక్కీ కౌశల్ ఇలా ఎంతో మంది హీరోయిన్లు… వయసులో తమ కంటే చిన్న వారు అయిన‌ హీరోలతో ప్రేమలో పడి డేటింగ్ చేశాక పెళ్లి చేసుకుంటున్నారు.

బాలీవుడ్లో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తున్న కత్రినాకైఫ్ ఈనెల 9వ తేదీన వయస్సులో తన కంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 38 ఏళ్ల కత్రినా వయసులో తన కంటే ఐదు ఏళ్ళు చిన్న వాడు అయిన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది.

ప్రియాంక చోప్రా అయితే ఏకంగా తన కంటే పదేళ్లు చిన్నవాడు అయిన‌ అమెరికన్ సింగర్ నిక్‌ను పెళ్లి చేసుకోవడం పెద్ద సంచలనం అయ్యింది. వారిద్దరూ కూడా పెళ్లికి ముందు డేటింగ్‌లో ఉన్నారు. ఇక మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ సైతం వయసులో తనకంటే చిన్న వ్యక్తితోనే డేటింగ్ చేస్తోంది. ఆమె తన కంటే పదిహేనేళ్లు చిన్నోడు అయిన మోడల్ రోహ‌మ‌న్ సాల్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మల్లికా అరోరా తన భర్త ఆర్బాజ్‌ఖాన్‌కు విడాకులు ఇచ్చి తనకంటే వయసులో పన్నెండేళ్లు చిన్నవాడు అయిన అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది. అస‌లు ఈ జంట ఏం చేసినా సంచ‌ల‌న‌మే అవుతోంది. ఇక బిపాషాబసు కూడా తన కంటె నాలుగేళ్లు చిన్నవాడు ఆయన క‌ర‌ణ్‌సింగ్‌తో కలిసి ఏడడుగులు వేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో మూడుముళ్ళు వేయించుకొని హ్యాపీగా ఉంది. కేవలం బాలీవుడ్లో మాత్రమే కాక హాలీవుడ్‌లో కూడా ఎంతో మంది హీరోయిన్లు వయసులో తమ కంటే చిన్న వాళ్ళు అయిన‌ హీరోలు, నటులతో డేటింగ్ చేయటం కామన్ అయిపోయింది.

ముదురు ముద్దుగుమ్మ‌లు కూడా కుర్ర హీరోల‌ను ప‌డేయ‌డం.. వారితే డేటింగ్ చేయ‌డం, పెళ్లి చేసుకోవ‌డం ఓ అదృష్టంగా భావిస్తున్న‌ట్టు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ సంస్కృతి బాగా ఎక్కువ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news