సినిమారంగంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న వారంతా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా ముందుగా హీరోయిన్ ఛాన్స్ రావాలంటే ఎన్నో గడపలు తొక్కాలి. ఎంతమంది చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. జీవితంలో ఎన్నో విషయాల్లో రాజీ పడాలి.. చాలామంది హీరోయిన్లు అయితే ఎంతోమంది పక్కలో పడుకుంటే గాని తమకు అవకాశాలు రాలేదని ఓపెన్‌గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలన్నా… నిలదొక్కుకోవాలి అన్నా కెరీర్ ఆరంభంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవని చెప్పేవారు కూడా ఉన్నారు.
బాలీవుడ్ జెర్సీ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ కూడా తన కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన. ఈ సినిమా బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్లోనూ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న మృణాల్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రారంభంలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ముందుగా టీవీ షోలతో కేరీర్ ప్రారంభించానని… అనంతరం హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 సినిమాతో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని… ఇండస్ట్రీలో చాలా మంది తనతో మరో కోణంలో మాట్లాడేవారని చెప్పింది.
అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ గుర్తుకు రావడంతో తాను ఎంతో ఏడ్చాను అని… ఆ సమయంలో తనకు తన తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ ఇచ్చారని ఆమె చెప్పింది. తాను ఏడుస్తున్న సమయంలో ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే… పదేళ్ల తర్వాత నీ కెరీర్ ఎలా ? ఉంటుందో ఆలోచించుకో… చాలామందికి ప్రేరణగా నిలవాలని తల్లిదండ్రులు తనను ఎంతో ప్రోత్సహించారని మృణాల్ ఠాకూర్ చెప్పింది. నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని తాను చాలా అదృష్టవంతురాలిని అని తెలిపారు.