Moviesఅత‌డు ఘోరంగా అవ‌మానించ‌డం వ‌ల్లే వివి. వినాయ‌క్ స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడా..!

అత‌డు ఘోరంగా అవ‌మానించ‌డం వ‌ల్లే వివి. వినాయ‌క్ స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడా..!

టాలీవుడ్లో వి.వి.వినాయక్ స్టార్ డైరెక్టర్. 18 సంవత్సరాల క్రితం వచ్చిన ఆది సినిమాతో ఒక్కసారిగా సంచలనం రేపిన వినాయక్ ఆ తర్వాత స్టార్ హీరోలకు సైతం వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ – ఖైదీ నెంబర్ 150 – బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి – జూనియర్ ఎన్టీఆర్ తో ఆది , సాంబ, అదుర్స్ – ప్రభాస్ తో యోగి – వెంకటేష్‌తో లక్ష్మీ లాంటి హిట్ సినిమాలు వినాయక్‌ తెరకెక్కించారు. ఇప్పటివరకు వినాయక్ తన కెరీర్లో 18 సినిమాలను రూపొందించారు.

పశ్చిమగోదావరి జిల్లా చాగ‌ల్లుకు చెందిన వి.వి.వినాయక్ దర్శకుడు అవ్వాలనే కోరికతో చెన్నై వెళ్లారు. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి సొంత ఊరు చాగల్లు వెళ్లిపోయారు. వినాయ‌క్ త‌ల్లి ఇక్కడే ఉండి ఏదైనా చేసుకోవాలని… సినిమాలు వద్దని సూచించారట. అయితే వినాయక్ అప్పటికే చదువు మధ్యలో ఆపివేయడం… సినిమాల్లోకి వెళ్లి తిరిగి వచ్చేయడంతో ఆయ‌న తండ్రి మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నారట.

ఆ సమయంలో తన సొంత ఊరికి చెందిన ఒక వ్యక్తి వినాయక్‌ని చూసి అవహేళనతో మాట్లాడారట. ఏరా సినిమాలు అన్ని వెళ్ళావు… వారం రోజులకే నీ బడాయి అయిపోయిందా ? అని ఎగతాళి చేస్తూ మాట్లాడడంతో ఎంతో బాధపడిన‌ వినాయక్… చావు అయిన బతుకు అయిన సినిమా రంగంలోనే తేల్చుకోవాలని అదే రోజు రాత్రి రైలు ఎక్కి చెన్నై వెళ్లిపోయారట.

ఆ తర్వాత వినాయక్ ఈవివి సత్యనారాయణ, సాగర్, క్రాంతి కుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసి… ఆది సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడు అయ్యారు. తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వినాయక్ వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆది హిట్ అయ్యాక వినాయక్ పెళ్లి కాకినాడలో చాలా వైభవంగా జరిగింది.

అలా తన గ్రామానికి చెందిన వ్యక్తి అవహేళన చేయడం వల్లే.. త‌న‌లో క‌సి పెరిగి… తిరిగి తాను చెన్నై వెళ్లి ఎన్నో కష్టాలు పడి అసిస్టెంట్ డైరెక్టర్ కో-డైరెక్టర్ స్థాయి నుంచి డైరెక్టర్ అయ్యానని వినాయక్ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news