తెలుగులో ఒకప్పుడు యాంకరింగ్ అంటే సీనియర్ యాంకర్ ఉదయభాను పేరు మాత్రమే గుర్తు వచ్చేది. అప్పట్లోనే హాట్ హాట్ లుక్స్‌తో యాంకరింగ్ అన్న పదానికి మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అయితే వయసు పైబడటంతో పాటు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో బిజీ కావడంతో ఉదయభానుకు అవకాశాలు తగ్గాయి. అయితే అదే సమయంలో ఝాన్సీ – సుమ ఉదయభాను ప్లేస్‌ను భర్తీ చేయడంతో ఆమె పూర్తిగా కనుమరుగు అయిపోయారు.
అయితే ఇప్పుడు ఉదయభాను తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే బాలయ్య అఖండ సినిమా సక్సెస్ అయ్యాక ఆ టీంను స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసింది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్సింగరాయ టీంతో కూడా స్పెషల్ చిట్‌చాట్ చేసింది. ఉదయభాను రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూలు, స్పెషల్ చిట్చాటలు చేయడంతో ఇప్పుడ ఆమె అభిమానులు ఖుషీగా ఉన్నారు.
బుల్లితెర మీద ఉదయభాను తనదైన ముద్ర ఎప్పుడూ వేసుకుంటూనే ఉంది. అయితే కొందరు దర్శక, నిర్మాతలు ఇప్పుడు ఉదయభానుకు తమ సినిమాల ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్‌గా చేయమని కోరుతున్నారు. అలాగే మంచి ఛాన్సులు వస్తే వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ఈ ముదురు యాంకరమ్మ ఉత్సాహంగా ఉందట. తన పోటీ మాంకర్లు సుమ, రష్మి, అనసూయ అటు బుల్లితెర తో పాటు వెండితెరను కూడా ఏలుతున్నారు.
మరి ఈ వయస్సులో రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను బుల్లితెర, వెండితెర మీద ఈ క్రేజీ యాంకర్లను తట్టుకుని ఎలా నిలబడగలగుతుందో ? చూడాలి. ఇక గతంలోనే ఉదయభాను వెండితెరపై ఐటెం సాంగులు చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ ఛాన్స్ వస్తే నటిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. ఏదేమైనా బుల్లితెరపై ఇప్పుడు ముదురు యాంకరమ్మలు అయిన ఈ ఆంటీల రచ్చ మామూలుగా లేదు.