స్టార్ హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ సాంగ్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. ఈ సాంగ్‌కు ఇప్పటికే 25 మిలియన్ లకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే మామూలు విషయం కాదు. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి సమంత వేసిన హాట్ హాట్ స్టెప్పులు… పాట పాడిన విధానం చూస్తుంటే ఈ పాటపై అప్పుడే ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ అనేది వచ్చేసింది.
పైగా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత హాట్ హాట్ గా తెరమీద కనిపించడంతో పాటు… అల్లు అర్జున్‌తో హాట్ హాట్ గా రొమాన్స్ చేయడం చూస్తుంటే ఆమె భర్తతో విడిపోయాక తెగించినట్టే కనిపించింది. అయితే ఈ ఐటమ్ సాంగ్‌పై రోజురోజుకూ సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా కాంట్రవర్సీ నడుస్తోంది.
మీ మగ బుద్దే వంకర బుద్ధి అన్న పదాలు పురుషుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పురుష సమాజం సమంతపై విరుచుకు పడుతోంది.
ఇలాంటి ఐటెం సాంగ్‌లో ఆమె ఎందుకు నటించాలని పలువురు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఏపీ పురుషుల సంఘం ఈ సాంగ్‌ను నిషేధించాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ సాంగ్ మగవారిపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందని.. దీనిని వెంగనే సినిమాలో నుంచి తీసేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే సినిమా రిలీజ్‌కు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఈలోగా ఈ వివాదం చెలరేగడం బన్నీకి, సుకుమార్‌కు ప్లస్ అయ్యేలా ఉంది. అయితే సమంతకు మాత్రం ఇది రోజు రోజుకు మైనస్ అవుతోంది. ముఖ్యంగా ప్రోమో వచ్చాక చాలా మంది నెటిజన్లు సమంత వేషం, ఆమె డ్యాన్స్ చేసిన తీరు చూసి ఆమెను ఆడుకుంటున్నారు.
అసలు సమంత ఈ ఐటెం సాంగ్ చేసిన విధానం చూస్తుంటే ఆమెకు పెళ్లయ్యిందా ? అన్న విషయం కూడా మర్చిపోయిందని.. మొత్తానికి చైతు విడాకులు ఇచ్చి చాలా మంచి పనిచేశాడని అంటున్నారు.