Moviesటాప్ హీరోయిన్ న‌గ్మా అంత‌మందితో ఎఫైర్ న‌డిపిందా...!

టాప్ హీరోయిన్ న‌గ్మా అంత‌మందితో ఎఫైర్ న‌డిపిందా…!

కొంతమంది సినీ నటులు సినిమా పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నా.. వృత్తిపరంగా వారికి పేరు ప్రఖ్యాతులు ఉన్నా… వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాల‌లో చిక్కుకుంటారు. మహానటి సావిత్రి వెండితెర మీద ఒక మహారాణిలా విరిగిపోయింది. ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ లతో పోటీ పడి మరీ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె వ్యక్తిగత జీవితంలో చేసిన పొరపాట్లతో చివరకు అత్యంత దీన స్థితిలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ, భోజ్‌పురి భాష‌లోనూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది నగ్మా.

మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు – మేజర్ చంద్రకాంత్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. నగ్మా అప్పట్లో తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కించింది. తెలుగుతో పాటు తమిళం – హిందీ – మలయాళంలో కూడా స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్ లు సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీ లో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నగ్మా తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేక తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంది.

ప్ర‌స్తుతం 47 సంవత్సరాల వయసులో ఉన్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతుంది. అయితే ఆమె గతంలో ముగ్గురు నలుగురుతో ప్రేమలో పడటం ఆ తర్వాత బ్రేక‌ప్ అవ్వ‌డం జరుగుతూ వచ్చింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లయింది. గంగూలీ – నగ్మా కలిసి అప్పట్లో రహస్యంగా పూజలు కూడా చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోతో కూడా నగ్మా ప్రేమలో పడింది.

న‌గ్మాను పెళ్లి చేసుకునేందుకు ఆ స్టార్ హీరో తన భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. అయితే ఇంతలోనే మ‌న‌స్ప‌ర్థ‌లు రావడంతో వీరిద్దరు కూడా విడిపోయారు. ఇక కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ తో కూడా నగ్మా ప్రేమాయణం నడిపిన ప్రచారం అప్పట్లో బలంగా వినిపించింది. ఆ తర్వాత శరత్ కుమార్‌తో కూడా బ్రేకప్ అయింది.

ఆ తర్వాత భోజ్‌పురికి చెందిన ఒక సీనియర్ హీరో – నగ్మా డేటింగ్ చేశారు. అతడితో కూడా బ్రేకప్ అవడంతో నగ్మా కెరీర్ నాశనం అయ్యింది. ఆ తర్వాత ఆమెకు ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. 2008లో భోజ్‌పురి దర్శకుడు అనిరుధ్ దర్శకత్వం వహించిన తేలం నెం 501 సినిమాల్లో మాత్రమే ఆమె చివరిసారిగా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నగ్మా ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news