టైటిల్: శ్యామ్‌సింగరాయ్
బ్యానర్: నిహారిక ఎంటర్టైన్‌మెంట్
నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ తదితరులు
మూలకథ: జంగా సత్యదేవ్
సినిమాటోగ్రఫీ: జాన్
ఎడిటర్: నవీన్ నూలీ
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
పీఆర్వో: వంశీ – శేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కోలా
సహ నిర్మాత: ఎస్. వెంకట్‌రత్నం
నిర్మాత: బోయినపల్లి వెంకట్
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్
రన్ టైం: 157 నిమిషాలు
రిలీజ్ డేట్: 24 డిసెంబర్, 2024
నేచురల్ స్టార్ నాని , సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్యామ్‌సింగరాయ్. బోయినపల్లి వెంకట్ నిర్మించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. నాని నటించిన చివరి రెండు సినిమాలు వి – టక్ జగదీష్ ఓటీటీలో రావడంతో నానిని థియేటర్లలో చూసి చాలా రోజులు అయ్యింది. ఈ సినిమాపై నాని ముందు నుంచి నాని మంచి కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలు అందుకుందో ? లేదో ? చూద్దాం.
కథ:
వాసుదేవ్ (నాని) ఒక అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్‌గా ఉంటాడు. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే క్రమంలో కీర్తి (కృతిశెట్టి)ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను తన షార్ట్ ఫిల్మ్‌లో నటింపజేసేందుకు కూడా ఒప్పిస్తాడు. ఆ తర్వాతో ఓ సినిమా చేసి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు, క్రేజ్ తెచ్చుకుంటాడు. అయితే నాని తన సినిమా కథను శ్యామ్‌సింగరాయ్ బుక్ నుంచి కాపీ కొట్టాడని అరెస్టు చేస్తారు. అసలు శ్యామ్‌సింగరాయ్ (నాని) ఎవరు ? రోజీ ( సాయిపల్లవి)కి శ్యామ్‌కు ఉన్న లింక్ ఏంటి ? 1960వ సంవత్సరానికి ఈ కథకు ఉన్న లింక్ ఏంటి ? వాసుదేవ్ తనకు తెలియకుండానే ఈ కథను ఎలా ? కాపీ కొట్టాడు ? వాసుదేవ్‌కు, శ్యామ్‌సింగరాయ్‌కు ఉన్న లింక్ ఏంటన్నదే ఈ సినిమా.
TL విశ్లేషణ:
సినిమా అంటే ఇష్టం ఉన్న ఫిల్మ్‌మేకర్ కథగా శ్యామ్‌సింగరాయ్ సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమాలో కళపట్ల ఉన్న అభిరుచిని దర్శకుడు బాగా ప్రజెంట్ చేశాడు. తారా, ఈడోఈడో పాటల విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. సాయి పల్లవి పాత్రను డిజైన్ చేసిన తీరుతో పాటు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన తీరుకు దర్శకుడికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇక ఉప్పెన స్టార్ కృతి శెట్టి అందంతో ఆకట్టుకుంది. ఫస్టాఫ్ అంతా ఓ మోస్తరు కామెడీతో నడుస్తూ మంచి టైం పాస్ ఇస్తుంది. శ్యామ్‌సింగరాయ్, రోసీ కథతో 1969 ప్లాస్‌బ్యాక్‌లోకి వెళ్లడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక సెకండాఫ్ అంతా మంచి ఎమోషనల్ ఫీలింగ్‌తో సినిమాను నడిపించాడు.
బెంగాల్ తండ్రికి, తెలుగు తల్లికి పుట్టిన సంఘ సంస్కర్తే శ్యామ్‌సింగరాయ్. అతడు తిరుగుబాటు వర్గం కవి. దేవదాసి అయిన మైత్రేయితో ప్రేమలో పడడం, ఆమెను ఆ దేవదాసి వృత్తితో పాటు భూస్వాముల భారీ నుంచి ఎలా విముక్తురాలిని చేశాడు ? అన్నదే కథ. నటన విషయానికి వస్తే నాని వాసుదేవ్‌గా చాలా సహజంగా నటించి మరోసారి తన నేచురల్ స్టార్ బిరుదుకు న్యాయం చేశాడు. ఇక శ్యామ్‌సింగరాయ్‌కూడా చేసిన పాత్రపై అతడికి ఎలాంటి కమాండింగ్ ఉందో ఫ్రూవ్ చేసింది.
ఈ సినిమా నాని కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించడంతో పాటు ఇటీవల నాని పాత్రల్లో మొనాటిని ఎక్కువైందన్న వస్తోన్న విమర్శలకు పూర్తిగా చెక్ పెట్టేసింది. నాని రెండు పాత్రల్లో కొత్త వైవిధ్యం చూపించాడు. ఇక దేవదాసిగా నటించిన సాయిపల్లవి పాత్ర చూస్తుంటే మనకు పాత తరం సావిత్రి, జమున, విజయనిర్మల లాంటి పరిణితి చెందిన హీరోయిన్ల నటన గుర్తుకు రాకమానదు. ఆమె నటన, నృత్యం ప్రేక్షకులను మైమరిపింజేస్తాయి.
సాంకేతికంగా ఎలా ఉందంటే…
సాంకేతికంగా విజువల్స్ అదిరిపోయాయి. ఇక మిక్కీ జే మేయర్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. సినిమా చాలా సార్లు సీన్లను ఎలివేట్ చేసి ప్రేక్షకుడు సినిమాతో ట్రావెల్ చేయడంలో ఉపయోగపడింది. ఎడిటింగ్ కూడా ఎక్కడా ఫీల్ మిస్ కాకుండా ఉంది. నిర్మాత బోయినపల్లి వెంకట్ నిర్మాణ విలువలు సూపర్బ్. దర్శకుడు రాహుల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పలేం.. అసలు తెలుగు సినిమాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి సినిమా రాలేదంటే అతడి దర్శకత్వ ప్రతిభ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్ ( + ):
– సరికొత్త అనుభూతి ఇచ్చే కథ
– అదిరిపోయే టెక్నికల్ వేల్యూస్
– అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ
– భావోద్వేగంతో కూడిన సెకండాఫ్
– సాంగ్స్
– స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ ( – ):
– స్లో గా మూవ్ అయ్యే కథనం
ఫైనల్‌గా…
శ్యామ్ సింగరాయ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామా. అసలు ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ప్రతి ఒక్కరు వెంటనే టిక్కెట్లు బుక్ చేసుకుని థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
TL శ్యామ్‌సింగరాయ్ రేటింగ్: 3.5 / 5