ReviewsTL రివ్యూ: పుష్ప ది రైజ్‌

TL రివ్యూ: పుష్ప ది రైజ్‌

టైటిల్‌: పుష్ప ది రైజ్‌
న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌, ధ‌నుంజ‌య్‌, రావు ర‌మేష్‌, సునీల్‌, అన‌సూయ, అజ‌య్ ఘోష్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: మిరోస్లోవ్ కుబా బ్రోజెక్‌
ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్ – రూబెన్‌
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ లాంగ్వేజెస్‌: తెలుగు – త‌మిళ్ – క‌న్న‌డ – మ‌ళ‌యాళం – హిందీ
రిలీజ్ డేట్‌: 17 డిసెంబ‌ర్‌, 2021

ప‌రిచ‌యం:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా పుష్ప‌. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఐదు భాష‌ల్లో బ‌న్నీ కెరీర్‌లోనే ఫ‌స్ట్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతోంది. సుకుమార్‌- బ‌న్నీ కాంబోలో గ‌తంలో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య 2 హిట్ అయ్యాయి. ఈ సినిమాతో వీరు హ్యాట్రిక్ కొడ‌తార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. రు. 200 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. అల వైకుంఠపురంలో లాంటి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బ‌న్నీ, రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ చేస్తోన్న సినిమా కావ‌డంతో పుష్పై అంచ‌నాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన పుష్ప బ‌న్నీ, సుక్కు కెరీర్‌ను మ‌రింత రైజ్ చేసేలా ఉందా ? లేదా ? అన్న‌ది TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
పుష్ప రాజ్ (అల్లు అర్జున్) క్రూర‌మైన ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ కోసం అత‌డు దేనికైనా సిద్ధంగా తెగించేసి ఉంటాడు. ఈ సిండికేట్‌లో పుష్ప తక్కువ టైంలో టాప్ ప్లేస్‌లోకి వెళ్లిపోతాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు త‌న పై వాళ్ల‌కు ఎందుకు ఎదురు తిరిగాడు ? ఈ ప్ర‌యాణంలో అత‌డు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు ? ఈ క్ర‌మంలోనే శ్రీ వ‌ల్లి ( ర‌ష్మిక మంద‌న్న‌) తో అత‌డికి ఉన్న సంబంధం ఏంట‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

TL విశ్లేష‌ణ‌:
పుష్ప అల్లు అర్జున్ వ‌న్ మ్యాన్ షో. స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో బ‌న్నీ న‌ట‌న పీక్స్‌లో ఉంది. బ‌న్నీ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ, లుక్స్ సూప‌ర్బ్‌గా ఉండేలా ఈ క్యారెక్ట‌ర్‌ను సుక్కు డిజైన్ చేశాడు. సినిమా అంతా బ‌న్నీ భుజాల మీదే మోశాడు. డీ గ్లామ‌ర్ రోల్‌లో బ‌న్నీ ప్రియురాలుగా ర‌ష్మిక మంద‌న్న పాత్ర ఓకే. ఇక మంగ‌ళం శీనుగా సునీల్ పాత్ర అంచ‌నాలు అందుకోలేదు. అన‌సూయ‌ను స‌రిగా వాడుకోలేద‌నిపించింది. ఇక ఫ‌హాద్ పాజిల్ పాత్ర సెకండాఫ్‌లో ఎంట‌ర్ అవుతుంది. పాత్ర చిన్న‌దే అయినా దానికి ఫాహద్ న్యాయం చేశాడు.

సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమాకు గ్రామీణ నేప‌థ్యం ఎంచుకున్నాడు. పుష్ప కోసం గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యం ఎంచుకున్నాడు. అయితే రంగ‌స్థ‌లంలో మెప్పించిన డ్రామా పుష్ప‌లో మాత్రం మిస్ అయ్యింది. సుకుమార్ పుష్ప‌ను రెండు పార్టులుగా తీయాల‌ని అనుకున్నాడు. అయితే అందుకు త‌గిన స‌రుకు ఉన్న‌ట్టు లేదు. అందుకే సినిమాను బాగా సా… గ‌దీసిన‌ట్టుగా ఉన్నాడు. అందుకే ఫ‌స్ట్ పార్ట్‌లో మ‌రీ అద్భుతంగా అనిపించే క‌థ మ‌న‌కు క‌నిపించ‌దు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, స్టార్టింగ్ మిన‌హా మిగిలిన క‌థ‌లో మ‌లుపులు ఉండ‌వు.. పైగా ప్లాట్ నెరేష‌న్ కూడా ఇబ్బంది పెడుతుంది.

ఫ‌స్ట్‌ హాఫ్ లో పెద్దగా ఏం జరగదు. కథ నత్తనడకన సాగుతుంది. ఫ‌స్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్లాక్ తప్ప పెద్దగా హై పాయింట్స్ అన్నవే లేవు. అయితే సెకండ్ పార్ట్‌కు కావాల్సిన సెట‌ప్‌ను మాత్ర‌మే ఫ‌స్ట్ పార్ట్‌లో సెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తుంది. సెకండాఫ్ నుంచి ఏం ఆశించ‌వ‌చ్చో ఫ‌స్ట్ పార్ట్ చివ‌ర్లో చిన్న టీజ‌ర్‌లా చూపించారు. ఫ‌స్టాఫ్‌లో ల‌వ్ ట్రాక్‌తో పాటు అందులో వ‌చ్చే కామెడీ సీన్లు న‌వ్విస్తాయి.

సాంకేతికంగా ఎలా ఉందంటే…
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌లో అంత మెస్మ‌రైజింగ్ లేదు. రెండు పాట‌లు మిన‌హా మిగిలిన ఆల్బ‌మ్ కూడా మిగిలిన సినిమాల రేంజ్‌లో చార్ట్ బ‌స్ట‌ర్ అయితే కాలేదు. సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్‌. పాత గ్రామీణ వాతావ‌ర‌ణం సెట‌ప్‌ను బాగా ఎలివేట్ చేసింది. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువ‌లు వంక‌పెట్ట‌లేనివిగా ఉన్నాయి. ఎటిడింగ్ వీక్‌గా ఉంది. చాలా సీన్ల‌కు క‌త్తెర వేసేయ‌వ‌చ్చు. ఇక వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ చాలా చోట్ల ఘోరంగా ఉంది. సీజీ వ‌ర్క్ చూస్తుంటే ఇంత నాసిర‌కంగానా ? అన్న ఫీల్ క‌లుగుతుంది.

ప్ల‌స్ పాయింట్స్ ( + ):
– అల్లు అర్జున్ పెంటాస్టిక్ పెర్పామెన్స్‌
– సామీ సామీ, ఊ అంటావా సాంగ్స్‌
– రూర‌ల్ సెట‌ప్, ర‌ష్మిక అందాలు
– కొన్ని యాక్ష‌న్ సీన్లు, డైలాగులు

మైన‌స్ పాయింట్స్ ( – ):
– స్లో నెరేష‌న్‌
– ర‌న్ టైం & ఎడిటింగ్‌
– సుకుమార్ మ్యాజిక్ ఫీల్ మిస్‌
– సెకండాఫ్‌
– విఎఫ్ఎక్స్

ఫైన‌ల్‌గా…
పుష్ప ది రైజ్ జ‌స్ట్ ఓకే అనిపించే యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌. సెకండ్ పార్ట్‌కు కావాల్సిన మంచి సెట‌ప్‌గా మాత్ర‌మే సుక్కు దీనిని వాడుకున్నాడు. అస‌లు క‌థ సినిమాలో ఏం లేదు. ఇప్పుడు ఆశ‌లు అన్నీ పుష్ప – 2 మీదే ఉన్నాయి. అస‌లు క‌థ అంతా సెకండ్ పార్ట్‌లో చూపించి.. జ‌స్ట్ దానికి కావాల్సిన సెట‌ప్ మాత్ర‌మే ఇందులో చూపించాడు. ఓవ‌రాల్‌గా సినిమా నిరాశ ప‌ర‌చ‌కుండా.. అలాగ‌ని మరీ ఓహో అనిపించ‌కుండా ఉంటుంది.

TL పుష్ప‌ రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news