Moviesఅఖండ స‌క్సెస్ మీట్‌ లో సందడి చేయనున్న ఆ ఇద్దరు స్టార్...

అఖండ స‌క్సెస్ మీట్‌ లో సందడి చేయనున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్ గా నటించిన చిత్రం “అఖండ”. మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబరు 2 న విడుదలై బాక్స్ ఆఫిస్ దగ్గర కాసుల వర్షం కురుపిస్తుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల‌లో నటించారు. థ‌మన్ సంగీతం అందించారు. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో అఖండ అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది.

బాల‌కృష్ణ , బోయ‌పాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ప్రాజెక్టు అఖండ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప్రభమజన్మ్ సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా అఇప్ప‌టికే బోయ‌పాటి, బాల‌కృష్ణ‌, థ‌మ‌న్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అఖండ స‌క్సెస్ గురించి చెప్పుకొచ్చారు. అఘోరాలను గౌర‌వాన్ని పెంచేలా బోయ‌పాటి సెకండాఫ్ తెర‌కెక్కించిన తీరుకు ప్రేక్ష‌క లోకం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. జై బాలయ్య పాట అయితే అదుర్స్. ఆ పాట వస్తున్నంత సేపు ధియేటర్స్ లో ఫ్యాన్స్ తమ సీట్లల్లో కూర్చోకుండా డ్యాన్సులు వేస్తున్నారట.

ఓవర్ ఆల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ‘అఖండ’ సినిమా డిసెంబరు 8న సక్సెస్​ మీట్ జరుపుకోనుంది. అయితే ఈ ఈవెంట్​కు సూపర్​స్టార్ మహేశ్​బాబు, ఎన్టీఆర్​ ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. దీంతో అభిమానులు అప్పుడే పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు వ‌స్తున్న స్పంద‌న‌పై ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా ట్వీట్లు కూడా చేశారు.

ఇక వీళ్లిద్దరు “అఖండ” సక్సెస్ మీట్ లో పాల్గోనబోతున్నారంటూ అంటూ తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు బాలయ్య హోస్ట్​గా చేస్తున్న ‘అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే’ షోలో పాల్గొనట్లు సూపర్​స్టార్ మహేశ్​బాబు వెల్లడించారు. బాలకృష్ణతో తీసుకున్న ఫొటోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ చేశారు.

 

Latest news