కృతిశెట్టి అలియాస్ బేబమ్మ… ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్లో ఎంతలా మార్మోగిపోతోందో చూస్తూనే ఉన్నాం. తొలి సినిమా ఉప్పెనతోనే కుర్రకారు మనసులో గిలిగింతలు పెట్టేసిన ఈ అమ్మడు.. తాజాగా నాని హీరోగా వచ్చిన శ్యామ్‌సింగరాయ్ సినిమాతో కూడా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. లిప్‌లాక్‌లతో పాటు ఏకంగా సిగరెట్లు ఊదేయడంతో అమ్మడు దేనికి వెనక్కు తగ్గనని క్లారిటీ ఇచ్చేసింది.
రొమాంటిక్ సన్నివేశాల్లో అవసరాన్ని బట్టి హద్దులు కూడా దాటతానని కృతి చెప్పేస్తోంది. ప్రస్తుతం ఉన్న క్రేజీ హీరోయిన్లలో కృతికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కర్నాటకలోని మంగళూరుకు చెందిన కృతితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసేందుకు ఇప్పుడు సౌత్‌కు చెందిన స్టార్ హీరోలు సైతం వెయిటింగ్లో ఉన్నారు. ఇక అక్కినేని బుల్లోడు నాగచైతన్య పక్కన కూడా బంగార్రాజు సినిమాలో ఆమె కాస్త ఓవర్ డోస్ ఇచ్చేసిందట. ఆ సినిమాలోనూ ఆమె అందాలు చూసేందుకు మనం రెడీ అవ్వాల్సిందే..!
ఇక శ్యామ్‌సింగరాయ్ సినిమాలో సిగరెట్ తాగే సీన్లో కనిపించడం ఆమెకు ఏ మాత్రం ఇష్టంలేదట. అసలు బయట ఎవరైనా స్మోక్ చేసే వాళ్లు పక్కన ఉంటేనే తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అలాంటిది తానే సినిమాలో ఆ పాత్ర చేయడంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. సిగరెట్ సీన్లో నటించనని దర్శకుడు రాహుల్‌కు చెపితే కృతికి, కీర్తికి తేడా ఎలా ? చూపిస్తావ్ ? అని ప్రశ్నించాడట.
దీంతో సవాల్‌గా ఆ పాత్రలో సిగరెట్ తాగి చూపించానని కృతి చెప్పింది. అయితే దర్శకుడు తనను మరీ అంత ఇబ్బంది పెట్టకుండా ఆరోగ్యసేత సిగరెట్టుని తనకోసం ప్రత్యేకంగా తెప్పించాడని కృతి చెప్పింది. అయితే సిగరెట్ తాగేతప్పుడు మాత్రం తాను చాలా ఇబ్బంది పట్టానని.. బోల్డ్ సీన్లలో నటించాల్సి రావడం చాలా కామన్ అని.. అయితే తాను అలాంటి సీన్లలో నటించనని ఎప్పుడూ గిరి గీసుకోలేదని తెలిపింది. ఇక కృతి ప్రస్తుతం రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నటిస్తోంది.