మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. పునాది రాళ్లు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు 151 సినిమాలు చేసిన చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలో నాలుగు దశాబ్దాలుగా మకుటంలేని మెగాస్టార్ గా కొనసాగుతున్నారు. చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు.
మరోవైపు యంగ్ డైరెక్టర్ల దర్శకత్వంలో వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక చిరంజీవి – కోదండరామి రెడ్డి… ఇద్దరిదీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 సినిమాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి కూడా కోదండరామిరెడ్డి సినిమాలతోనే స్టార్‌డమ్ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో చివరిసారిగా ముఠామేస్త్రి సినిమా వచ్చింది.
వీరిద్దరూ కలిసి ఎన్నో సంవత్సరాలు… ఎన్నో రోజుల పాటు కలిసి పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పరంపరలో ఛాలెంజ్ సినిమా ఒకటి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి… రావు గోపాలరావుతో ఒక ఛాలెంజ్ విసురుతారు.
ఒక్క రూపాయితో ఐదు సంవత్సరాలలో తాను రు. 50 లక్షలు సంపాదించి వస్తానని చిరంజీవి అంటే… రావు గోపాలరావు కారుకూతలు వద్దని చిరంజీవికి కౌంటర్ ఎస్తారు.
రావు గోపాలరావు చాలెంజ్ లో చిరంజీవి ఎలా ? గెలిచారు అన్న అంశాన్ని కోదండరామిరెడ్డి చాలా బాగా తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కోదండరామిరెడ్డి ఎక్కడికి వెళ్ళినా… చివరకు అమెరికా వెళ్ళిన కూడా అక్కడ ఎంతో మంది యువకులు ఆ సినిమా మాకు చాలా స్ఫూర్తి సార్… ఆ సినిమా ప్రేరణగా తీసుకుని తాము ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు వెళ్దామని కోదండరామిరెడ్డితో అనేవారట.
ఇది తనకు చాలా గర్వ కారణం అనిపించిందని కోదండరామిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చాలెంజ్ ప్రేరణగా తీసుకుని ఎంతోమంది యువకులు కష్టపడి పైకి ఎదగారని కూడా ఆయన తెలిపారు.