Moviesరెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తే వాళ్లు త‌ట్టుకోలేరు... గీతామాధురి బిగ్ బాంబ్‌..!

రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తే వాళ్లు త‌ట్టుకోలేరు… గీతామాధురి బిగ్ బాంబ్‌..!

ఇండ‌స్ట్రీలోని ఫీమేల్ సింగ‌ర్స్‌లో గీతామాధురి ఒక‌రు. త‌న గాత్రంతో గీతామాధురి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు చేసింది. గీతా మాధురి వాయిస్ వినే అభిమానులు తెలుగు గ‌డ్డ‌పై ల‌క్ష‌ల్లో ఉన్నారు. కేవ‌లం సాధార‌ణ జ‌నాలు, పాట‌ల ప్రియులు మాత్ర‌మే కాకుండా సెల‌బ్రిటీలు సైతం ఆమె పాట‌లు వినేందుకు చెవులు కోసుకుంటారు. స్టార్ హీరోలు, స్టార్ సంగీత ద‌ర్శ‌కులు కూడా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెతో త‌మ సినిమాల్లో పాట‌లు పాడించుకుంటారు.

న‌చ్చావులే సినిమాలో నిన్నే నిన్నే కోరా సినిమాతో ఆమె ఉత్త‌మ సింగ‌ర్‌గా నంది అవార్డు కూడా అందుకుంది. గీతా మాధురి రెమ్యున‌రేష‌న్ గురించి బిగ్ బాంబ్ పేల్చింది. తాను పాడే పాటల్లో అన్ని సూప‌ర్ హిట్ అవ్వ‌వ‌ని.. కొన్ని మాత్ర‌మే హిట్ అవుతాయ‌ని చెప్పింది. తాను పాడే పాటకు ఎంత కావాలో డిమాండ్ చేయ‌న‌ని.. డిమాండ్ చేస్తే నువ్వు కూడా అడుగుతున్నావా ? అని అదోలా చూస్తార‌ని ఆమె చెప్పింది.

పాట‌ల కోసం రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తే.. కొంద‌రు అస్స‌లు త‌ట్టుకోలేరంటూ ఆమె ప‌రోక్షంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను ఎత్తి చూపింది. థ‌మ‌న్ గారు ఏ పాట‌కు ఎంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వాలో ముందుగానే ఫిక్స్ చేసేస్తార‌ని ఆమె తెలిపింది. ఆమె త‌న రెమ్యున‌రేష‌న్ ఎంత‌న్న‌ది చెప్ప‌క‌పోయినా ఆమె పాడిన పాట‌లు మాత్రం హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా నంద‌మూరి హీరోల‌కు గీత పాడుతోన్న పాట‌ల‌కు మంచి క్రేజ్ ఉంటోంది.

తాజాగా అఖండ సినిమాలో జై బాల‌య్య సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో చ‌దువుకున్న గీత న‌టుడు నందును ప్రేమ‌వివాహం చేసుకుంది. ఓ షార్ట్ ఫిల్మ్‌లో న‌టిస్తోన్న స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి పెళ్లి చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news