అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు అనుభవిస్తున్నారు. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. విడాకుల తర్వాత చైతుతో పాటు సమంత వరుసపెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. విడిపోయినా ఈ ఇద్దరు సంతోషంగా ఉన్నా.. వీరికి విడాకుల వల్ల కొందరికి మాత్రం పెద్ద చిక్కులు వచ్చి పడుతున్నాయి. వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కోల్గేట్ టూత్ పేస్ట్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ జంటకు పెళ్లి అయ్యాక వచ్చిన బ్రాండ్ ఇది. కోల్గేట్ మౌత్ ఫ్రెష్కు చైతు.. కోల్గేట్ షాల్ట్కు సమంత ప్రమోటర్లుగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు.
దీంతో ఈ బ్రాండ్ల పరిస్థితి ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇది ముంబై యాడ్ ఏజెన్సీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినట్టు తెలుస్తోంది. భార్య భర్తలు విడిపోయినా.. ఇప్పుడు అంబాసిడర్లుగా కలిసే చేస్తారా ? లేదా… వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ బ్రాండ్ బాధ్యతల నుంచి తప్పుకుంటారా ? అన్న హాట్ హాట్ చర్చ నడుస్తోంది. విడాకుల సమయంలో తాను ఎంతో మనో వేదనకు గురైనట్టు సమంత ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. చైతన్య మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు.
ఇక సోషల్ మీడియాలోను సమంత మరి హాట్ హాట్ గా ఉంటుందని… ఆమెపై భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఇక సమంత చైతుతో భార్యగా విడిపోయినా… వృత్తి పరంగా కలిసి పనిచేస్తే కోల్గేట్ సంస్థకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ కూడా కలిసి పని చేసేందుకు ఇష్టపడకపోతే కోల్గేట్ సంస్థ వీరిద్దరిలో ఎవరో ఒకరిని తప్పిస్తుందా ? లేదా ఇద్దరిని తప్పించి కొత్త అంబాసిడర్ తో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయించుకుంటుందా ? అన్నది చూడాలి.
ఏదేమైనా సమంత వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ చైతూతో కలిసేందుకు ఇష్టపడటం లేదని అర్థమవుతోంది. అయితే చైతు మాత్రం చాలా హుందాగా తన పని తాను చేసుకుపోతూ అభిమానుల మనసులు గెలుచుకున్నారు.