రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా రంగం నటకిరీటి. ఎంతమంది హీరోలు ఎంత కామెడీ చేసినా కూడా రాజేంద్ర ప్రసాద్ కామెడీ మాత్రం ఏ హీరోకు రాదు రాలేదని చెప్పాలి. ఎన్టీఆర్ – ఏఎన్నార్ – సూపర్ స్టార్ కృష్ణ నుంచి ఆ తర్వాత తరంలో మెగాస్టార్ చిరంజీవి – బాలయ్య – నాగార్జున – వెంకటేష్ ఇప్పటి తరంలో మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఇలా ఎందరు స్టార్ హీరోలు వచ్చినా కూడా నిజమైన కామెడీ హీరో ఎవరు అంటే ఒక రాజేంద్రప్రసాద్ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది.
అయితే అల్లరి నరేష్ మాత్రం కొంతవరకు రాజేంద్రప్రసాద్ బాటలో నడిచారు. రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. మరో విశేషం ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు స్వగ్రామం అయిన నిమ్మకూరు రాజేంద్ర ప్రసాద్ స్వగ్రామం. ఎన్టీఆర్ ఇంటి పక్కనే రాజేంద్రప్రసాద్ ఇల్లు ఉండేది. ఎన్టీఆర్ హీరోగా ఉండడంతో రాజేంద్రప్రసాద్ కు కూడా చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.
రాజేంద్రప్రసాద్ ఎప్పుడు ఎంత బాధలో ఉన్నా కూడా ఆయన ప్రతి విజయం వెనుక ఆయన భార్య విజయ చాముండేశ్వరి ఉందని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్టే… తన విజయం వెనక తన భార్య విజయ చాముండేశ్వరి ఉన్నారంటూ రాజేంద్రప్రసాద్ గర్వంగా చెబుతారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలో అవకాశాల కోసం ఎన్నో అవమానాలు పడిన రాజేంద్రప్రసాద్ ఈ రోజు నటకిరీటి బిరుదు సొంతం చేసుకున్నారు.
రాజేంద్రప్రసాద్ భార్య గురించి చాలా మందికి తెలియదు. ఆమె బయట కూడా పెద్దగా కనిపించరు. విజయ చాముండేశ్వరి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆమెకు సినిమాల గురించి పెద్ద ఆసక్తి కూడా ఉండేది కాదట. అందుకే ఆమె ఎక్కువగా సినిమా ఫంక్షన్లో కూడా కనిపించరు. ఆమె భర్త రాజేంద్ర ప్రసాద్ తో పాటు పిల్లలు మాత్రమే లోకంగా జీవించేవారు.
రాజేంద్రప్రసాద్ కెరీర్లో స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఆయనపై ఎన్నో పుకార్లు వచ్చినా.. కూడా ఆమె భర్త అంటే ఎంతో నమ్మకంతో ఉండడంతో పాటు.. వాటిని ఏనాడు పట్టించుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ కుమారుడికి కూడా పెళ్లి అయింది. ఆయన కోడలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఉంటారు