Moviesద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని నిజాలు...!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని నిజాలు…!

దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రాజమౌళి … బాహుబలి ది కంక్లూజన్ సినిమా వరకు ఓటమి అనేది లేకుండా దూసుకుపోతూ భారతదేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి కెరీర్ ఎలా ? స్టార్ట్ అయ్యింది. ఆయన సినిమా జర్నీలో ఉన్న ఆసక్తికర సంగతులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

రాజమౌళికి చిన్నప్పటినుంచి సినిమాలు అంటే ఇష్టం. మరో వైపు తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు కజిన్ కీరవాణి సినిమా రంగంలో ఉండటంతో… ఇంటర్మీడియట్ పూర్తి అయిన వెంటనే రాజమౌళి సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. అయితే ఏ విషయంలో అయినా రాజీ పడకుండా గెలవాలన్న క‌సే రాజమౌళిని ఈ రోజు ఈ స్థాయికి తీసుకు వచ్చింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల‌కు సంబంధించిన పాఠాలు రాజమౌళి చిన్నప్పటినుంచి నేర్చుకుంటూ వచ్చారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాఘవేంద్ర రావును ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా నియమించింది. అప్పుడు రాజమౌళిని ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా ప్రభుత్వం తరఫున నియమించారు. రాజమౌళిలో టాలెంట్ గుర్తించిన రాఘవేంద్రరావు నిర్మాతగా మారి శాంతి నివాసం సీరియల్ తీశారు. ఈ సీరియ‌ల్‌ దర్శకత్వ బాధ్యతలు రాజమౌళికి అప్పగించారు.

ఆ సీరియల్ అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. బుల్లితెరను ఒక ఊపు ఊపేసింది. అలా బుల్లితెర నుంచి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో వెండితెరపై రాజమౌళి తన కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమా తర్వాత రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కూడా మారిపోయింది. ఇక రాజమౌళి రెండో సినిమా సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరగడంతోపాటు రాజమౌళి అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఆ వెంటనే రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతో మంది నిర్మాతలు క్యూ లో ఉన్నారు. అయితే రాజమౌళి మాత్రం కథా బలం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని… తాను ఎక్కువ సినిమాలు చేయనని కరాఖండిగా చెప్పేశారు.

 

ఇక రాజమౌళి స్టామినాను చాటిచెప్పిన మరో సినిమా మగధీర. 12 సంవత్సరాల క్రితమే రు. 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాతో రాజమౌళి స్టామినా మరోసారి రుజువు అయింది. ఇక బాహుబలి 1 , బాహుబలి 2 సినిమాల తర్వాత ఇప్పుడు రాజమౌళి ప్రపంచస్థాయి దర్శకుడు అయిపోయారు. రాజమౌళి పేరు ఎల్ల‌లు దాటేసింది. ఇక రాజమౌళి భార్య రమ , రాజమౌళి కొడుకు పేరు కార్తికేయ. రాజమౌళి కుమార్తె పేరు మయూఖ‌. త‌న గురించి తండ్రి బ‌య‌ట‌కు చెప్ప‌డం ఆమెకు ఏ మాత్రం ఇష్టం ఉండ‌ద‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news