ఇండస్ట్రీలో ఎవరికీ అయినా సక్సెస్ అనేది ముఖ్యం. హీరో అయినా.. హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్ అయినా సక్సెస్ లో ఉంటేనే వారికి డిమాండ్ ఉంటుంది. ఎవరు అయినా సక్సెస్ మాత్రమే కోరుకుంటారు.. తమ సినిమాలు ప్లాప్ కావాలని కోరుకోరు. అయితే ఇండస్ట్రీలో ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం దేవుడా తన సినిమా ప్లాప్ కావాలని కోరుకున్నారట. అదేంటి అంత పెద్ద గొప్ప డైరెక్టర్ ఏంటి ? తన సినిమా ప్లాప్ కావాలని కోరుకోవటం ఏంటి అన్నది చూస్తే దీని వెనుక ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.
స్టార్ దర్శకుడు కోదండరామిరెడ్డి సంధ్య సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు ఆయన వరుస హిట్ సినిమాలతో కెరీర్ లో ఫుల్ బిజీ అయిపోయారు.
ముఖ్యంగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా కోదండరామిరెడ్డి కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఖైదీ సినిమా తర్వాత ఆయన తిరుగులేని స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆయనతో సినిమాలు చేసేందుకు ఎంతో మంది స్టార్ హీరోలు, నిర్మాతలు క్యూలో ఉండేవారు. ఒకానొక దశలో ఉదయం 5 గంటలకు ఆయన షూటింగ్ కి వెళితే… తిరిగి ఇంటికి వచ్చేసరికి 12 గంటలు అయ్యేదట. ఆయన కేవలం ఐదు గంటలు మాత్రమే పడుకుని మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చేది.
ఆ టైంలో ఎంతో మంది నిర్మాతలు పెట్టెల్లో క్యాష్ తీసుకువచ్చి మాకు ఒక సినిమా చేయాలని కోదండరామి రెడ్డిపై తీవ్రమైన ఒత్తిడి చేసేవారట. తాను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పితే… మీకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే సినిమా చేయమని రిక్వెస్ట్ చేసేవారట. ఇక ఆయన బయటకు రాగానే మద్రాసులోని లేక్ హౌస్ లో ఆయన ఇంటిముందు ఏకంగా 20 కార్లు ఉండేవట.
నిర్మాతలు ఆయన దర్శనం కోసం ఉదయం నుంచి ఇంటి బయట వేచి చూసేవారట. అయితే బయట ఉన్న 20 కార్లలో కోదండరామిరెడ్డికి కూడా ఎవరి కారు ఎక్కాలో తెలిసేది కాదట. చివరకు ఆయన జీవితం ఒక యాంత్రికంగా మారిపోవడంతో… దేవుడా ఇస్తే తనకు ఒక్క ప్లాప్ సినిమా ఇవ్వవా ? అని మనసులో అనుకునేవారట. అయితే ఆ తర్వాత ఆయనకు వరుసగా రెండు.. మూడు ప్లాప్ సినిమాలు రావడం.. ఆ తర్వాత ఆయన తిరిగి వరుస హిట్లతో దూసుకుపోవడం జరిగాయి.