టాలీవుడ్ లో సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. బాలయ్య తన మనసులో ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టేస్తారు. ఆయన ఎవరి గురించి అయినా ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో.. ఉన్నది ఉన్నట్టు చెబుతారు. బాలయ్య మనసులో ఏదీ దాచుకోరు అన్నది తెలిసిందే. బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఒవరి గురించి మరొకరి దగ్గర మాట్లాడటం… లోపల ఒకటి పెట్టుకుని.. బయటకు మరొకటి మాట్లాడటం ఆయనకు చేతకాదు. ఈ విషయం ఇండస్ట్రీతో పాటు తెలుగు జనాలు అందరికీ తెలుసు.
ఇక ఇండస్ట్రీలో బాలయ్యకు దర్శకుల హీరోగా పేరు ఉంది. ఒక సారి కథ విన్నాక దర్శకుడు ఏం చెపితే అదే చేయడానికి ఆయన ఫిక్స్ అవుతారు. అస్సలు కథలో జోక్యం చేసుకోరు. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ పోవడమే..! ఒక సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి నటిస్తారు. షూటింగ్‌కు కూడా టైమ్ టు టైమ్ వచ్చేస్తారు. బాలయ్యతో సినిమా ఉందంటే దర్శకులతో పాటు మిగిలిన సినిమా యూనిట్ అంతా కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సెట్‌కు వచ్చేస్తారు. బాలయ్య క్రమశిక్షణ అంత కరెక్ట్ గా ఉంటుంది.
ఈ క్రమంలోనే బాలయ్య మనస్తత్వాన్ని అర్థం చేసుకోని కొందరు ఆయన్ను పదేపదే ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే బాలయ్యను దగ్గర నుంచి చూసిన వాళ్ళు మాత్రం బాలయ్య అంత మంచి వ్యక్తి ఉండరని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూజిత ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు.
బాలయ్య తాజా సినిమా అఖండ అద్భుతంగా ఉందని చెప్పిన పూజిత… మన టాలెంట్ ను ఎప్పుడు వర్క్ లోనే చూపించాలని చెప్పారు. ఇండస్ట్రీలో తనకు ఎన్టీఆర్ – బన్నీ – చరణ్ – ప్రభాస్ అంటే ఇష్టమని… జూనియర్ ఎన్టీఆర్ కేవలం నటన కోసమే పుట్టాడని పూజిత తెలిపారు. ఇక కొందరు సోషల్ మీడియాలో బాలయ్యను ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారని… అలా ట్రోల్ చేసిన కొందరు స్టూడెంట్స్‌ను తాను తిట్టానని పూజిత చెప్పారు.
బాలయ్యను ట్రోల్ చేసే వాళ్లకు అఖండ సినిమాతో ఆయన అద్భుతమైన సమాధానం చెప్పారని… ఆయన మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని ఆమె అన్నారు. అఖండ బాలయ్య కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించారు. ఇక సీనియర్ నటీమణులలో పూజిత మాత్రమే కాదు యాంకర్ ఉదయభాను, పాప్ సింగర్ స్మిత లాంటి వాళ్ళు కూడా బాలయ్య తమకు చేసిన సాయాల గురించి భావోద్వేగాలతో మెచ్చుకున్న సందర్భాలు అనేకం.