తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో. అతను ఆరడుగుల అందగాడు. ఆ హైట్ కి తగ్గ వెయిట్. పర్సనాలిటీకి తగ్గ వాయిస్ ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వెండితెరపై బాహుబలిగా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నారు. చిన్న స్దాయి హీరో నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ పడిపోతూ లేస్తూ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతూ ఫైనల్ గా పాన్ ఇండియా స్దాయి హీరో గా సెటిల్ అయ్యాడు. బాహుబలికే హయ్యస్ట్ పెయిడ్ టాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమా హిట్ తో 100కోట్ల రెమ్యూనరేషన్ ని ఎప్పుడో క్రాస్ చేసేశారు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమా కు 150కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడుగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్.. త్వరలోనే “రాధేశ్యామ్” సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రెండు దశాబ్దాల క్రితం యూరప్‌లో జరిగిన ఓ ప్రేమకథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ప్రేమకథతో పాటు యాక్షన్, ఎమోషన్ అన్ని కలగలిపి రాధాకృష్ణ ఈ సినిమను తెరకెక్కిస్తున్నాడట.కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ నటిస్తోంది. ఇక సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమా జనవరీ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజాగా ‘రాధే శ్యామ్’ సౌత్ వెర్షన్స్‌కు తమన్ రీ రికార్డింగ్ అందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘రాధేశ్యామ్’ సినిమా అంతా ప్రేమతో నిండిపోయింది.. అందుకే ఈ సినిమాకు ప్రేమతో వర్క్ చేస్తున్నాను. ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచం కాస్త ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటుంది’’ అని ట్వీట్ చేశారు తమన్. ఇక యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం) జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, హిందీలో మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్‌ల బృందం అందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ప్రభాస్ తో వర్క్ చేయని తమన్ ఫ్స్ట్ టైం ఆయన సినిమాలో వేళ్లు పెట్టడం సినిమాకు మరింత హైప్ తీసుకోచ్చింది. మరి చూడాలి సినిమా ఎలా ఉంటాదో..?