సీనియర్ హీరోయిన్ టబు ఐదు పదుల వయస్సుకు చేరువ అయినా కూడా… ఇప్పటికీ అదే చెక్కుచెదరని అందంతో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో టబు పాత్రను చూసిన వారు ఈ వయసులోనే ఆమె అందానికి ఫిదా అయిపోయారు.. ఆకాశానికి ఎత్తేశారు. ఇంత వయసు వచ్చినా టబు ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కూలి నెంబర్ వన్ సినిమాలో టబు హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఆమె ఇండస్ట్రీకి కొత్త.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనకు కావలసినట్టుగా నటన రాబట్టుకునే విషయంలో హీరోయిన్లను బాగా టార్చర్ పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కూలి నెంబర్ వన్ సినిమాలో పలు సీన్లతో పాటు పాటల్లో తాను అనుకొన్న బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేందుకు టబును పదేపదే టార్చర్ పెట్టడంతో పాటు ఆమెతో ఎన్నో టేక్‌లు చేయించేవారట.
ఇక కిలకిలమని కళావరు రాణి అన్న పాటను సింగపూర్ లో షూట్ చేశారు. అంతకుముందు నెదర్లాండ్స్ రాజధాని అమస్టర్ డాంలో ఒక పాట షూట్ చేసి … ఆ వెంటనే సింగపూర్ వచ్చి ఇక్కడ కళావరు రాణి షూట్ చేశారట నెదర్లాండ్స్‌లో ఉష్ణోగ్రతలు కేవలం ఒకటి రెండు డిగ్రీలు మాత్రమే ఉంటాయి. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. రెండు రోజులకే సింగపూర్ వచ్చి ఇక్కడ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్లో పాల్గొనడం ఇబ్బందిగా ఉందట.
అప్పటికే తిరిగి ఇండియాకు వచ్చేయటానికి టికెట్లు కూడా బుక్ అయ్యాయట. అయితే ఆమె డ్యాన్స్ చేయడంలో ఇబ్బంది పడుతుండడంతో పదే పదే టేక్‌లు, రీ షూట్లు చేయాల్సి వచ్చిందట. దీంతో ఆమె ఒకానొక దశలో రీ టేక్‌లు చేయలేక బోరున ఏడ్చేసిందట. వెంటనే రాఘవేంద్రరావు ఆమెను దగ్గరకు తీసుకు ఓదార్చి… సర్దిచెప్పి.. ఆమెకు ధైర్యం చెప్పి షూటింగ్ కొనసాగించారట. ఇక కూలీ నెంబర్ వన్‌లో పొగరు బోతు అమ్మాయిగా టబు నటన తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటకీ అలాగే ఉంటుంది.