ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు.. స్టార్ దర్శకులు అవుతూ ఉంటారు. అయితే కొందరు ఎంతో టాలెంట్ ఉన్నా, ఎంతో అందం ఉన్నా కూడా స్టార్లు కాలేరు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇండస్ట్రీ అన్నాక కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. అయితే అలా స్టార్లు కాలేని వాళ్ళు ఉంటారు… మరికొందరు మాత్రం తాము తీసుకునే నిర్ణయాల కారణంగా స్టార్లు కావలసిన వారు కాస్త కెరీర్లో వెనక పడిపోతారు. వీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా వీరి జీవితాలు అధం పాతాళంలో ఉంటాయి. 17 సంవత్సరాల క్రితం 7 / G బృందావన్ కాలనీతో ఒక్కసారిగా మెరిసిన సోనియా అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే.
ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా వచ్చిన 7 / G బృందావన్ కాలనీలో ఆమె హీరోయిన్ గా నటించింది. సోనియా అగర్వాల్ ఆ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ప్రేమలో పడింది. అప్పట్లో తెలుగుతో పాటు తమిళంలో తన అందచందాలతో కుర్రకారును ఆమె ఒక ఊపు ఊపేసింది. సోనియా నటిగానే కాకుండా మోడల్‌గా కూడా మరణించింది. 2002లో నీ ప్రేమకై అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె సినిమాల కంటే ముందుగా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. కెరీర్ ఆరంభంలోనే సెల్వ రాఘవన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన ఆమె 2006లో అతడిని పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె అతడితో మనస్పర్థలు కారణంగా 2009లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. కెరీర్ ఆరంభంలో సోనియా అగర్వాల్ అందచందాలను చూసిన వారు ఆమె ఖచ్చితంగా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలేస్తుందని అందరూ అనుకున్నారు. ఎప్పుడు అయితే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచే ఆమె కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు సినిమాలకు పూర్తిగా దూరమైంది.
భర్తకు విడాకులు ఇచ్చే సరికే ఆమె ఫేడవుట్ అయిపోయింది. ఆమెకు ఛాన్సులు లేవు. ఇక ఇటీవల రెండో ఇన్నింగ్స్ లో మంచి ఛాన్సుల కోసం ఆమె ప్రయత్నాలు చేస్తోంది. టెంపర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇప్పటికీ మరో పెళ్లి చేసుకోకుండా ఉన్న సోనియా… కెరీర్ బాగున్నప్పుడు ప్రేమ పెళ్లి చేసుకుని మంచి భవిష్యత్తును పాడు చేసుకుందని ఆమె అభిమానులు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.