టాలీవుడ్‌లో ఇప్పుడు మళ్లీ దిల్ రాజు హవా నడుస్తోంది. కరోనాకు ముందు నుంచే కాస్త స్లో అయినట్టు కనిపించిన రాజు ఇప్పుడు వరుస పెట్టి పెద్ద కాంబినేషన్లు సెట్ చేస్తూనే మరోవైపు వరుసగా పెద్ద సినిమాల రైట్స్‌ను నైజాంతో పాటు ఉత్తరాంధ్రలోనూ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకేసారి రిలీజ్ అవుతోన్న అన్ని పెద్ద సినిమాల రైట్స్‌ను దక్కించుకుంటోన్న రాజు కొన్ని సినిమాల రిలీజ్ డేట్‌ను సైతం వాయిదా వేసేలా చేస్తున్నారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.
వచ్చే సంక్రాంతికి రాజమౌళి ఆర్ ఆర్ తో పాటు ప్రభాస్ రాధే శ్యామ్, పవన్ కళ్యాణ్ – రానా భీమ్లా నాయక్, మహేష్ సర్కారువారి పాట ముందుగా ఖర్చీఫ్ వేసుకున్నాయి. అయితే సర్కారువారి పాట సమ్మర్‌కు వెళ్లిపోయింది. ఇక రాధేశ్యామ్ జనవరి 12, ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న ఖర్చీఫ్ వేసుకుని కూర్చొన్నాయి. ఇక భీమ్లానాయక్ కూడా ముందు నుంచే జనవరి 12న రిలీజ్ చేయాలని అనుకున్నారు.
అయితే ఈ మూడు సినిమాలను కూడా నైజాంలో దిల్ రాజే పంపిణీ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు ఒకేసారి వస్తే దిల్ రాజుకు దెబ్బ తప్పదు. పైగా ఆర్ ఆర్ సినిమా మీద భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేశాడు. అప్పుడు అనుకున్న స్థాయిలో ఆ సినిమా అమౌంట్ రికవరీ కాదు. ఏటొచ్చి ఏమైనా దిల్‌రాజుకే భారీ నష్టం తప్పదు. అందుకే కొద్ది రోజులుగా భీమ్లానాయక్ సినిమాను వాయిదా వేయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరి 25కు వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
దీంతో ఇప్పుడు సంక్రాంతి పోటీ ఆర్ ఆర్ వర్సెస్ రాధేశ్యామ్ మధ్యే ఉంటుంది. ఇక ఆ రోజు రిలీజ్ కావాల్సిన ఎఫ్ 3 సినిమాను ఏప్రిల్ 29కు వాయిదా వేశారు. అది దిల్ రాజు సొంత సినిమా. ఇక సంక్రాంతి రేసు నుంచి తమ అభిమాన హీరో సినిమాను వాయిదా వేసేలా రాజు ఒత్తిడి చేయడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాజు తీరుపై మండి పడుతున్నారు. అదే రాధే శ్యామ్‌ను వాయిదా వేయించవచ్చు కదా ? తమ సినిమాయే ఎందుకు వాయిదా వేయించారంటూ వారు ఫైర్ అవుతున్నారు. దిల్ రాజు బిజినెస్ లెక్కలు ఎవరికి ఎరుక..?