పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు.. అన్నట్టుగా.. ప్రకాశం జిల్లా పరుచూరు టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. కుమారుడు ఏలూరి దివ్యేష్ పిన్నవయసులోనే.. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. వస్త్ర పారిశ్రామిక రంగంలోకి తన 14వ ఏటనే అడుగు పెట్టిన దివ్యేష్.. అతి తక్కువ సమయంలో..తనను తాను నిరూపించుకున్నారు. కేవలం రెండేళ్లలోనే.. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. దీంతో ఆయన ప్రపంచంలోనేఅతి పిన్నవయసులో.. రికార్డు సొంతం చేసుకున్న పారిశ్రామిక వేత్తగా ప్రంపంచం దృష్టిని ఆకర్షించారు.
అయితే.. ఇక్కడ దివ్యేష్ తండ్రి సాంబశివరావు కూడా.. అతిపిన్న వయసులోనే.. రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీరావడంతోనే.. అతి తక్కువ సమయంలోనే ఆయన ప్రజల మనిషిగా తనను తాను నిరూపించుకోవ డం గమనార్హం. ఉత్తమ ఎమ్మెల్యేగా ఆయన అవార్డు అందుకున్నారు. అంటే.. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా.. ఏలూరి వంశ వారసుడిగా దివ్వేష్ కూడా.. అతి పిన్న వయసులోనే తన సామర్థ్యాన్ని ప్రపంచ దేశాల ముందు నిరూపించడం గమనార్హం. అందరి కన్నా కూడా.. భిన్నంగా ఆలోచించడం.. సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వడం .. యువ పారిశ్రామిక వేత్తగా దివ్యేష్ సాధించిన అద్భుతమనే చెప్పాలి.
దివ్యేష్ తయారు చేసిన.. 99 శాతం బ్యాక్టీరియాను నిరోధించే టవల్స్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించిం ది. ఈ టవల్‌ను 520 జీఎస్‌తో ఐదు రకాల రంగుల్లో రూపొందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ ఉత్పత్తులకు.. ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. దీంతో ఏటా ప్రపంచ స్థాయిలో ఇచ్చే వీకనెక్ట్ ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్.. గ్లోబల్ ఫేమ్ అవార్డుకు.. దివ్యేష్‌ను ఎంపిక చేయడం.. కోల్‌కతాలో జరిగిన కార్య క్రమంలో ఆయనకు అవార్డును అందించడం.. దివ్యేష్‌ను తండ్రిని మించిన తనయుడిగా నిలబెట్టిందన డంలో ఎలాంటి సందేహం లేదు.
కేవలం 16 ఏళ్ల పిన్నవయసులోనే.. దివ్యేష్ గుర్తింపు దక్కించుకోవడం పట్ల.. ప్రకాశం జిల్లా వాసులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృషి ఉంటే.. మనుషులు రుషులవుతారు..అన్న సూత్రాన్ని పిన్నవయసులోనే పుణికి పుచ్చుకున్న దివ్యేష్.. దేశంలోని అనేక మంది యువ పారిశ్రామికవేత్తల్లో సరిలేరు నీకెవ్వరుఅన్న విధంగా.. రికార్డు సాధించారు. ఈ విజయం ఏలూరి కుటుంబానికే సొంతమని అంటున్నారు వీరి గురించి తెలిసిన వారు. ఏదేమైనా.. యువ పారిశ్రామిక వేత్తగా దివ్యేష్.. సాధించిన రికార్డు నభూతో..అన్న విధంగా ఉందని వస్త్ర రంగనిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.