Moviesఅఖండ సినిమాకు బోయ‌పాటి రెమ్యున‌రేష‌న్‌పై ఇంత ట్విస్టా...?

అఖండ సినిమాకు బోయ‌పాటి రెమ్యున‌రేష‌న్‌పై ఇంత ట్విస్టా…?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా అఖండ మాట వినిపిస్తోంది. ఆంధ్రా లోని అనకాపల్లి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ … అమెరికా , కెనడా , ఆస్ట్రేలియా వరకు అఖండ ఒక ఊపు ఊపేస్తోంది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా అఖండ‌ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు అఖండ ఆ రెండు సినిమాలను మించిన రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అఖండ తొలి వారం ముగిసేసరికి అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. విచిత్రం ఏంటంటే బాలయ్యకు తక్కువ మార్కెట్ ఉన్న నైజాంలో అఖండ సినిమా 9.5 కోట్లకు అమ్మారు. తొలి వారం ముగిసే సరికి అక్కడ ఏకంగా 14.5 కోట్ల షేర్ కొల్లగొట్టి నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.

అఖండ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడు అనే దానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు ఒక్కొక్కరు సినిమాకు రు. 15 కోట్ల నుంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ లాంటి వాళ్లు అయితే లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు ముందు బోయపాటి తీసిన వినయవిధేయరామ డిజాస్ట‌ర్ అయింది.

అందుకే అఖండ‌ సినిమాకు రెమ్యున‌రేష‌న్‌ తీసుకోకుండా నిర్మాత నుంచి తన ఖర్చులు మాత్రమే తీసుకున్నాడట. సినిమా హిట్ అయ్యాక వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటానని నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డికి బోయపాటి గట్టిగా చెప్పాడట. మరోవైపు కరోనా నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ పెరగడంతో రవీందర్ రెడ్డి కూడా బోయపాటికి లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఆసక్తి చూపించారట. అయితే ఇప్పుడు అఖండ భారీ లాభాలు కొట్టడంతో… బోయపాటికి పది కోట్లకు పైగా రెమ్యునరేషన్ రూపంలో అంద‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news