నేచురల్ స్టార్ నాని హీరోగా కృతి శెట్టి – సాయిపల్లవి – మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా శ్యామ్‌సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చింది. నాని ఈ ఏడాది నటించిన వి – టక్ జగదీష్ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే శ్యాం సింగరాయ్ సినిమా మాత్రం తొలిరోజు నుంచే అదిరిపోయే హిట్ టాక్ తెచ్చుకుంది. శ్యామ్ సింగరాయ్‌గా నాని నటన… దేవదాసు పాత్రలో సాయి పల్లవి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, రాహుల్ డైరెక్షన్, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి.
పుష్ప లాంటి పెద్ద సినిమా ధియేటర్ లలో ఉన్నాకూడా నాని సినిమా ఫస్ట్ వీక్ ముగిసేసరికి అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 3.5 కోట్ల షేర్ రాబట్టిన సింగరాయ్ వరల్డ్ వైడ్ గా మూడు రోజులకు రు. 17 కోట్లు షేర్ కొల్లగొట్టింది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని కూడా ఈ స్థాయిలో వసూళ్లు అంటే మామూలు విషయం కాదు.
నాని కుమ్మేశాడనే చెప్పాలి. అదే ఏపీలో కూడా అన్ని థియేటర్లు ఓపెన్ అయ్యి ఉండడంతో పాటు టిక్కెట్ రేట్లు మామూలుగా ఉండి ఉంటే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. ఈ సినిమాకు రు. 22 కోట్ల బిజినెస్ జరిగింది.
శ్యామ్‌సింగరాయ్ ఫస్ట్ వీక్ వసూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 6.17 కోట్లు
సీడెడ్ం – 1.67 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.41 కోట్లు
ఈస్ట్ – 0.60 కోట్లు
వెస్ట్ – 0.50 కోట్లు
గుంటూరు – 0.78 కోట్లు
కృష్ణా – 0.56 కోట్లు
నెల్లూరు – 0.38 కోట్లు
————————————————————–
ఏపీ + తెలంగాణ = 12.07 కోట్లు (20.45 కోట్లు గ్రాస్)
————————————————————–
కర్ణాకట, రెస్టాఫ్ ఇండియా – 2.31 కోట్లు
ఓవర్సీస్ – 2.85 కోట్లు
————————————————————————————
టోటల్ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 17.13 కోట్లు (30.35 కోట్లు గ్రాస్)
————————————————————————————