Moviesత‌న ప్రేమ పెళ్లి సీక్రెట్స్ బ‌య‌ట పెట్టిన శివ‌జ్యోతి..!

త‌న ప్రేమ పెళ్లి సీక్రెట్స్ బ‌య‌ట పెట్టిన శివ‌జ్యోతి..!

శివ జ్యోతి టీవీ9 లో పాపులర్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమెకు అక్కడ కన్నా బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు వచ్చింది. న్యూస్ ప్రెజెంటర్‌గా తెలంగాణ యాసతో ఎంతోమందిని ఆకట్టుకున్న శివజ్యోతి ఎప్పుడైతే బిగ్‌బాస్ షో లోకి వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత శివ జ్యోతి లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. అస‌లు బిగ్‌బాస్ షోలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా కూడా శివ‌జ్యోతి వెంట‌నే ట్యాప్ తిప్పేసి క‌న్నీళ్లు కార్చేసేది. నాగార్జున సైతం ఎన్నో సార్లు అమ్మా శివ‌జ్యోతి నువ్వు ఆ క‌న్నీళ్లు కాస్త త‌గ్గించ‌మ్మా అని చెప్పేవాడు.

ఒక వైపు న్యూస్ ప్రజెంట‌ర్‌గా న్యూస్ ఛానల్ లో బిజీ బిజీగా ఉంటోంది. మరోవైపు వ‌రుస షోల‌తో పాటు ఈవెంట్ల‌తో త‌న సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది. ఇక శివ జ్యోతిది ప్రేమ వివాహం. ఆమె తన భర్తను ప్రేమించి… పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చివరకు ఆమె పంతం పట్టి ఇంట్లో పెద్దలను ఒప్పించి మరి తన భర్తను పెళ్లాడింది. ఆమె తన భర్తకు ముద్దుగా గంగూలీ అని పేరు పెట్టుకుంది.

హైదరాబాద్‌కు వ‌చ్చిన కొత్త‌లో స‌రైన అవ‌కాశాలు లేక‌.. ఈ జంట కెరీర్లో నిలదొక్కుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. త‌న భ‌ర్త అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని.. కెరీర్‌లో తాను ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు ఎంతో సాయం చేశాడ‌ని చెప్పింది. ఇదిలా ఉంటే శివ‌జ్యోతి ఇప్పుడు సూప‌ర్ క్వీన్ అనే కొత్త షోలో క‌నిపిస్తోంది. ఈ షో గురించి ఆమె ఎన్నో విష‌యాలు ప్రేక్ష‌కుల‌తో పంచుకుంది.

ఇక పిల్ల‌ల ప్రేమ పెళ్లిళ్ల విష‌యంలో త‌ల్లిదండ్రులు చేసేది కూడా క‌ర‌క్టే అని.. అయితే ఆ వ‌య‌స్సులో వారు మ‌న‌సు అలాగే ఆలోచిస్తుంద‌ని ఆమె చెప్పింది. అయితే అన్ని ప్రేమ పెళ్లిళ్లు ఫెయిల్ కావు అని.. అని ఎరేంజ్‌డ్ మ్యారేజ్‌లు స‌క్సెస్ కావ‌ని.. జీవితంలో రాజీ ప‌డాల్సిందే అని ఆమె చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news