అతిలోక సుందరి శ్రీదేవి సినిమా జీవితం అంతా పెద్ద సంచలనం. తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమెకు కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ – చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ ఇలా స్టార్ హీరోలందరితో కలిసి నటించే అవకాశం దక్కింది. శ్రీదేవికి తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చింది మాత్రం టాలీవుడ్ అని చెప్పాలి. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి భారతదేశంలోనే అతిలోక సుందరిగా కీర్తించబడింది.
ఆమె బాలీవుడ్ కి వెళ్ళాక సౌత్‌లో సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ఆమె నేషనల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీదేవి నేషనల్ హీరోయిన్ గా ఎదిగిన విధానం చాలా మంది హీరోయిన్లకు ఆదర్శం. ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాలో ఆయనకు మనవరాలిగా నటించిన శ్రీదేవి తర్వాత ఆయన పక్కన హీరోయిన్‌గా చేయాల్సి వచ్చింది.
ఎన్టీఆర్ నటించిన బడిపంతులు సినిమాలో ఆయనకు మనవరాలి పాత్రలో నటించిన శ్రీదేవి… ఆ తర్వాత కొద్ది రోజులకు హీరోయిన్ అయ్యారు. ఎన్టీఆర్‌తోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్‌గా శ్రీదేవి నటించారు. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవిని హీరోయిన్‌గా పెట్టాలని ముందుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అనుకున్నారట.
అప్పుడు ఎన్టీఆర్ ఆమె గతంలో మనవరాలిగా చేసిన విషయం చెప్పగా.. ప్రస్తుతం ఆమె వయస్సు ఎంత అని ఎన్టీఆర్ అడిగారట. అందుకు రాఘవేంద్రరావు 16 అని చెప్పగా.. ఎన్టీఆర్ నవ్వుతూ నా వయస్సు కూడా 16 యే కదా ? అని చెప్పారట. నటించడానికి ఏజ్ ఎందుకు ? అని.. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే అని చెప్పారట. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్ తెరపై చూస్తే వావ్ అనేలా ఉంది.
అయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ముందుగా ఎన్టీఆర్ శ్రీదేవితో నటించడం చూసి కాస్త ఇబ్బంది పడినా తర్వాత వరుస హిట్లు వచ్చాక వారికి అలవాటు అయిపోయిందట.