సీనియర్ హీరోయిన్ ఆమని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినా జగపతిబాబు హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన శుభలగ్నం సినిమాలో ఆమె చేసిన పాత్ర.. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా తెలుగు ప్రజల మదిలో నిలిచిపోయింది. డబ్బు పిచ్చి కోసం కట్టుకున్న భర్తను రోజాకు అమ్ముకునేందుకు కూడా సిద్ధపడిన పాత్రలో ఆమని నటన అద్భుతం. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రోజా నటించింది. డబ్బు కోసం భర్తను కూడా మరో ఆడదానికి అమ్ముకుంటారా ? అని అప్పట్లో ఆమె పాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆమని ఎక్కడ కనపడినా కూడా ఆ పాత్ర గురించే ఎక్కువగా అడిగే వారట.
ఆయని వ్యక్తిగత జీవితం విషయానికొస్తే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చిన్నప్పటినుంచే ఆశతో ఉండేదట. ఈ క్రమంలోనే తన తండ్రిని ఎదిరించి మరీ తల్లిని తీసుకుని చెన్నై వెళ్లిపోయిందట. అక్కడ సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగు , తమిళంతో పాటు దక్షిణ భారత దేశంలో స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలన్న తన కోరిక మాత్రం నెరవేరలేదు అని ఎన్నో సందర్భాల్లో చెప్పింది.
ఇక ఇప్పుడు ఉన్నట్టుగా కాస్టింగ్ కౌచ్ అప్పట్లో పెద్దగా లేదు. ఒకటి రెండు సందర్భాల్లో హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైనా అప్పట్లో ధైర్యంగా బయట పెట్టేవారు కాదు. ఇక తన సినిమా కెరీర్ లో ఎన్నో చేదు అనుభవాలు చూశా అని చెప్పిన ఆమని… తనకు సినిమాల్లో అవకాశాలు కావాలని కొందరిని సంప్రదిస్తే వాళ్ళు ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో పాటు గెస్ట్ హౌస్ కి వచ్చేయ్ అనేవాళ్ళు అట. దీంతో తనకు విషయం అర్థమయ్యేది అని చెప్పింది.
దానికి తోడు వాళ్ళు నువ్వు ఒక్కదానివే రా … మీ అమ్మ అవసరం లేదు అని చెప్పడంతో వాళ్ల విషయం తనకు అర్థమై అలాంటి వాళ్లకు తాను దూరంగా ఉన్నానని ఆమని చెప్పుకొచ్చింది. ఇక ఆమని మొదటిసారిగా సీనియర్ నరేష్ పక్కన జంబలకిడిపంబ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆమన దశ పూర్తిగా మారిపోయింది. చాలా తక్కువ రోజుల్లోనే టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఆమని బుల్లితెర మీద కూడా ఒక సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. తనకు మంచి అవకాశాలు వస్తే మళ్లీ వెండితెరపై కనిపిస్తానని చెబుతోంది.