తెలుగు తెరపై ఎంత మంది హీరోయిన్లు వచ్చినా మహానటి సావిత్రికి ఉన్న క్రేజ్ వేరు. తెలుగు సినీ అభిమానుల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో వచ్చిన మహానటి సినిమా మళ్లీ ఆమెను అందరికి గుర్తుచేసింది. అభినయతారగా అఖిలాంద్ర ప్రేక్షకుల మనసులు దోచుకున్న సావిత్రి మహానటిగా ఎదిగిన తీరు అద్భుతం. మహానటి సావిత్రి .. తన హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఏకైక హీరోయిన్ అని చెప్పవచ్చు. ఈమె సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతలా నటించి ప్రతి సినిమాకు ఈమె హైలెట్ కావడం విశేషం.
13 ఏళ్ల వయస్సులోనే కాకినాడలో జరిగిన ఆంథ్రనాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా వచ్చిన ఫృధ్పీరాజ్ కపూర్ ఆమెను సినిమాలలో చేరమని సలహా ఇవ్వడంతో 1949లో మద్రాసుకు ట్రైన్ ఎక్కేసింది సావిత్రి.
ఇక అలా మొదటిసారి 1950లో వచ్చిన సంసారం సినిమాలో కథానాయిక పాత్ర పోషించింది సావిత్రి. కానీ కొన్ని షాట్లు తీసిన తరువాత వయస్సు తక్కువగా ఉందనే కారణంతో ఆమెను తీసేశారు. తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ పాతాళ భైరవి సినిమాలో హీరోయిన్ గా నటించి ఘన విజయం అందుకుంది.
1953 సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపుతిప్పిందనే చెప్పాలి. ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూ గించిన సినిమా ‘దేవదాసు’ లో పార్వతి పాత్రను చేసి అమదరిని మెప్పించింది. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం కావడం విశేషం. నిజానికి మొదట ఈ సినిమాలో పార్వతిగా షావుకారు జానకిని తీసుకున్నారు..కానీ ఏవో ఇబ్బందలవల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రికి దక్కింది. మొదటి నుండే దేవదాసు నవలను చదువుతూ పెరిగిన సావిత్రికి ..ఆ సినిమా ఛాన్స్ రాగానే సంబరపడింది.
ఈ సినిమాలో నటిస్తున్నపుడు ఆమె పాత్ర ల్లో ఎంత లీనమైపోయేవారటే. దేవదాసు చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక సన్నివేశంలో నాగేశ్వరరావుతో నటిస్తూ తలుపుకేసి తల బాదుకుని ఏడ్వాల్సిన సన్నివేశం ఉంటుంది సావిత్రికి. ఇక ఆ సన్నివేశంలో ఆమె పూర్తిగా లీనమైపోయి.. డెరైక్టర్ కట్ చెప్పినా కూడా ఆమె తల బాదుకుంటూ ఏడుస్తూనే ఉన్నారట.
ఆ తర్వాత నాగేశ్వరరావు, దర్శకుడు రాఘవయ్య వెళ్లి ఆమె ను సముదాయించాల్సి వచ్చింది. ఇక ఇటువంటి సీన్ల లో నటించినపుడు సావిత్రి ఇంటికి వెళ్లి భోజనం కూడా చేసేవారు కాదట. ఆ సినిమాలోని సీన్ లను తలచుకుంటూ అలాగే నిద్రపోయేవారట. ఏది ఏమైనా సావిత్రి లాంటి హీరోయిన్ మళ్లీ మనకు దొరకరు అనే చెప్పాలి.