అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన కెరీర్ మీద పూర్తిగా కాన్సంట్రేషన్ చేస్తోంది. కెరీర్‌పై కాన్సంట్రేషన్తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోన్న సమంత శాకుంతలంతో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాలకు, ఓ కోలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత ఐదేళ్ల క్రితం చైతన్యతో పెళ్లికి ముందు చేసిన ఓ కామెంట్‌ను ఇప్పుడు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సమంతను ట్రోల్ చేసే ఉద్దేశంతోనే వారు ఈ డైలాగ్ వైరల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చైతుతో పెళ్లికి ముందు సమంత ఓ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూలో షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆ ప్రశ్నల్లో కొన్ని బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి. అప్పుడు సమంత ఇచ్చిన ఆన్సర్లు కూడా వైరల్ అయ్యాయి. ఫుడ్ ఆర్ సెక్స్ దేనికి ఫస్ట్ ప్రయార్టీ అన్న ప్రశ్నకు ఆమె ఆన్సర్ ఇస్తూ ఫుడ్ లేకుండా ఒక్క రోజు అయినా ఉంటానని చెప్పిన సమంత తన ఫస్ట్ ఓటు సెక్స్‌కే అన్నట్టుగా చెప్పింది. అప్పుడు సమంతకు పెళ్లి కాలేదు.
దీనిపై అప్పట్లోనే కొందరు రకరకాలుగా చర్చించుకున్నారు. అయితే ఫుడ్‌కు, సెక్స్‌కు సంబంధం ఏంటని ఆమెకు కొందరు సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు చైతుకు విడాకులు ఇచ్చేసింది. దీంతో కొందరు నాటి కామెంట్‌ను వైరల్ చేస్తూ విడాకుల తర్వాత సమంత ఫుడ్ కన్నా ఎక్కువుగా కోరుకున్నది ఎలా ? లభిస్తుందబ్బా ? అని వెకిలిగా కామెంట్లు పెడుతున్నారు. నాడు ఆమె చేసిన కామెంట్‌ను మళ్లీ తెరమీదకు తేవడం ద్వారా నిస్సిగ్గుగా పైశాచికానందం పొందుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.