సమంత అంటే స్టార్ హీరోలందరికి ఇష్టమే. ఆమె ఫ్రెండ్లీ గా ఉంటాది. ఆమె సెట్ లో ఎక్కడ ఉన్న అందరిని పలకరిస్తూ జాలీగా మాట్లాడుతూ సందడి చేస్తుంది అంటుంటారు ఆమె తో నటించిన హీరోలు. ఇక అలాంటి సమంత ఇప్పుడు మూగబోయింది. ఎంతో ఇష్టంగా లవ్ చేసుకుని ప్రాణంగా ప్రేమించి 100 ఏళ్ళు హ్యాపీగా కలిసి ఉండాలి అనుకుంటూ జీవితాని ప్రారంభించిన నాగచైతన్య సమంత విడిఫోవాలని నిర్ణయించుకుని అభిమానుల మనసులను ముక్కలు చేసారు. మళ్ళీ కలవండీ అంతూ రిక్వెస్ట్ చేస్తున్న ఇద్దరు అస్సలు తగ్గట్లేదు. అంత పెద్ద గొడవ ఏం జరిగిందో కూడా తెలియట్లేదు వాళ్ల మధ్య. పోనీ వాళ్ళు అయినా ఇది మా ప్రాబ్లం అని చెప్పుతున్నారా అంటే అది లేదు విడిపోయి వాళ్లను బాధ పెట్టుకుంటూ అభిమానులని బాధ పెడుతున్నారు ఈ జంట.
ఇక విడాకుల తరువాత కాస్త సైలెంట్ అయిన సమంత..ఆ బాధ నుండి తేరుకుని సినిమా లు చేస్తూ బిజీగా ఉంది. ఇక నాగ చైతన్య కూడా సినిమాలు చేస్తున్నాడు కానీ అస్సలు బయటకు కనిపించడం లేదు. షూటింగ్ సెట్లల్లో కూడా ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఇక సమంత అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుందే కానీ..నాగ చైతన్య అసలు శూన్యం అయిపోయాడు. ఇక ఇది చూసిన అభిమానులు మీరు బాధ పడుతూ..మమ్మల్ని బాధ పెట్టడం అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక సమంత తో ఒక్కటి అంటే ఒక్కటే సినిమా చేసిన చరణ్ ఆమె గురించి మీడియా ముఖంగా కీలక కామెంత్స్ చేసారు. ఆయన సినిమా ప్రమోషన్స్ లో భాగంగ ఓ ఇంటర్వ్యుల్లో సమంత గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ..”సమంత కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్.. అంటూ మూడు ముక్కల్లో చెప్పేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నిలబడింది.. ఇంకా తన స్థాయిని పెంచుకుంది.. ఎంతో ఎత్తుకు ఎదిగింది.. శక్తివంతంగా తయారైందనే ఉద్దేశ్యంలో సమంత గురించి రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ మాటలన విన్న సామ్ ఫిదా అయినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మూడు లవ్ సింబల్స్‌తో ట్విటర్లో షేర్ చేసింది.
♥️♥️♥️ https://t.co/IqHN3aQ8Jw
— Samantha (@Samanthaprabhu2) December 27, 2021