స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత బన్నీ, రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ కలిసి చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. బన్నీ కెరీర్‌లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప ది రైజ్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక సినిమాకు యబో యావరేజ్ టాక్ వస్తోంది.
పుష్ప: ది రైజ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన యాక్షన్ సినిమా. అల్లు అర్జున్ సినిమా అంతా వన్ మ్యాన్ షోతో సినిమాను పడిపేశాడు. సినిమా రన్ టైం చాలా ఎక్కువుగా ఉండడంతో పాటు నెరేషన్ చాలా చోట్ల స్లోగా ఉంది. ఓవరాల్‌గా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, లుక్, ఫస్టాప్ కామెడీ బిట్స్, ఇంటర్వెల్ సీన్స్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫస్ట్ ఫైట్, ఫహాద్ ఎంట్రీ సీన్స్ బాగున్నాయి.
ఇక సినిమా చాలా వరకు స్లో, ప్లాట్ నెరేషన్‌తో ముందుకు నడవడంతో చాలా చోట్ల విసుగు తెప్పిస్తుంది. వీఎఫ్ఎక్స్ అంచనాలకు తగినట్టుగా లేవు. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల సెట్ కాలేదు. రన్ టైంతో పాటు సమంత ఐటెం సాంగ్ కూడా థియేటర్లలో మరి అంత గొప్పగా లేకపోవడం.. ఓవరాల్‌గా సినిమా జస్ట్ ఓకే. రన్ టైం, ప్లాట్ నెరేషన్ మైనస్ అయ్యాయి.
క్లైమాక్స్‌కు ముందు చివరి అరగంట ఆట కూడా ప్లాట్‌గానే ఉందని అంటున్నారు. ఏదేమైనా పుష్ప మాస్ ఫ్యాన్స్ మెచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. క్లాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా ఎంత వరకు ఎక్కుతుంది అనేది డౌట్ ఉంది. మరి కొద్ది సేపట్లో పుష్ప భవితవ్యం ఏంటో తేలిపోనుంది.