ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా…. హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ కాంబోలో చేసిన తాజా సినిమా పుష్ప ది రైజ్. అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ తర్వాత బన్నీ, ఇటు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో పుష్ప పై మామూలు అంచనాలు లేవు. బన్నీ కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్పకు రిలీజ్‌కు ముందే రు. 145 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
దీనికి తోడు పుష్ప రిలీజ్‌కు రెండు రోజుల ముందే ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడంతో పుష్పకు కాస్త ప్లస్ అయ్యింది. ఇక పుష్ప బన్నీ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళంతో పాటు నార్త్‌లో హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ముందు నుంచి ఉన్న హైప్‌తో అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది.
తొలి రోజు రు. 71 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన పుష్ప.. రెండు రోజులకు రు. 116 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. కేవలం రెండు రోజులకే వరల్డ్ వైడ్‌గా రు. 100 కోట్ల మార్క్ దాటేసి.. ఏకంగా రు. 116 కోట్ల గ్రాస్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. మిక్స్ డ్ టాక్‌తోనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే అసలు బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న టాక్ వచ్చి ఉంటే ఇక బాక్సాఫీస్ బాహుబలి రేంజ్లో కుదులై పోయి ఉండేదనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక పుష్ప పార్ట్ 2 కోసం ఇప్పుడు అందరూ ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.