టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరో రామ్ చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళితో కలిసి సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని రాష్ట్రాలను విపరీతంగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక గత రాత్రి చెన్నైలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అదిరిపోయింది. ఈ ఈవెంట్‌కు తమిళనాడు ఎమ్మెల్యే, యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్‌తో పాటు శివకార్తీకేయన్ కూడా వచ్చారు.
ఎన్టీఆర్ నుంచి 2018 లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత మళ్లీ సినిమా రాలేదు. దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ పచ్చ చొక్కాతో కనిపించారు. దీని గురించి ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఎన్టీఆర్ బాలీవుడ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పారు.
పైగా ఇటు ఎన్టీఆర్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉండడంతో పాటు భవిష్యత్తులో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అంచనాల నేపథ్యంలో ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు. ముంబైలో జరిగిన ప్రమోషన్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ , రాజమౌళి తో పాటు దగ్గుబాటి రానా కూడా పాల్గొన్నాడు. వీరంతా కలిసి ఓ ఫొటోకు పోజు ఇచ్చారు. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముగ్గురు ఆర్‌లకు తోడుగా మరో ఆర్ కూడా తోడైంది అని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.
అయితే ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ పసుపు పచ్చ షర్ట్ వేసుకుని ఫొటోలకు ఫోజు ఇచ్చాడు. ఈ ఫొటో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ వేసుకున్న ఈ ఫొటోను తెలుగుదేశం అభిమానులు మార్ఫింగ్ చేసి ఎన్టీఆర్ కుడి చాతి పైన టీడీపీ గుర్తు ఫ్రింట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఇది నిజమే అనుకున్న ఎన్టీఆర్, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ తర్వాత ఇది మార్ఫింగ్ చేసిందన్న విషయం బయటకు వచ్చింది.
ఇక కొందరు మాత్రం ఎన్టీఆర్ నిజంగా అలా పసుపు చొక్కా వేసుకుని టీడీపీ కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్ అవుతారో ? మళ్లీ 2009లో ఎన్టీఆర్ ప్రచారంతో ఏపీలో ఎలా హైలెట్ అయ్యారో.. ఆ రోజులు ఎప్పుడు వస్తాయో ? అని చర్చించుకుంటున్నారు.