టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసి ఎన్టీఆర్ కు తిరుగులేని స్టార్ డం ఇచ్చిన సినిమా ఆది. 2002 మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఆ రోజుల్లోనే ఆది తెలుగు సినిమా చరిత్రలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి ఏకంగా 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వివి వినాయక్ ఈ సినిమాతోనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
అప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేసిన వినాయక్ ఆదితో దర్శకుడు అయ్యి సూపర్ హిట్ కొట్టారు. అప్పటి వరకు ఈవీవీ సత్యనారాయణ – సాగర్ – క్రాంతి కుమార్ లాంటి సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ క్రమంలోనే తాను దర్శకుడు అవ్వాలని ఒక కథను కూడా రెడీ చేసుకుని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ ( బుజ్జి ) బ్యానర్లో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. అయితే వాస్తవంగా ఆది సినిమా ముందు బాలకృష్ణతో తీయాలని వినాయక్ ఆ కథ రెడీ చేసుకున్నారట.
ముందుగా వినాయక్ అనుకున్న కథలో ఇద్దరు బాలకృష్ణలు ఉంటారు. అందులో బాలకృష్ణ తమ్ముడు చిన్నప్పుడు విలన్ పై బాంబులు విసురుతాడు. ఆ తర్వాత పెద్ద బాలకృష్ణ పోలీస్ అయ్యాక అనుకోకుండా తన తమ్ముడిని కొట్టాల్సి వస్తుందట. ఆ కథలో టాటా సుమోలు గాల్లోకి ఎగురుతాయి. ఈ సన్నివేశాలతో ముందుగా వినాయక్ బాలయ్య కోసం కథ రాసుకున్నాడట. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి రావడంతో… తాను ముందుగా బాలయ్య కోసం రాసుకున్న కథలోని చిన్నపిల్లాడు విలన్లపై పరిగెత్తుకుంటూ బాంబులు విసిరే సీన్… టాటా సుమోలు గాల్లోకి ఎగిరే సీన్ ఆది సినిమా కోసం వాడుకుని కథను మార్చారట.
అలా ఆది కథలోకి ఎన్టీఆర్ ఎంటర్ అయ్యాడు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే వినిపిస్తూనే ఉంటాయి. కీర్తిచావ్లా ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించింది. విచిత్రమేంటంటే అది తర్వాత వినాయక్ తన రెండో సినిమానే బాలయ్యతో చెన్నకేశవరెడ్డి గా చేశారు.