నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. నాని, కృతిశెట్టి, సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయిన ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఎవరి నోట విన్నా, సోషల్ మీడియా టాక్ చూసినా కూడా బొమ్మ బ్లాక్‌బస్టరే అంటున్నారు.
ఫస్టాఫ్‌లో నాని నటన, టైమింగ్ పర్ఫెక్ట్. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ అయ్యాయి. ఫస్టాఫ్ సూపర్బ్. నాని గతం, రోసీ (సాయిపల్లవితో) 1969 నాటి ప్రేమాయణం ఇవన్నీ మంచి థ్రిల్‌తో పాటు ఎమోషనల్‌గా ఉంటాయి. దేవదాసీలు పడుతున్న ఇబ్బందులతో పాటు కొన్ని దశాబ్దాల క్రితం ఈ వృత్తి ఎలా ఉండేదో చక్కగా చూపించారు.
సినిమా ప్లస్‌ల విషయానికి వస్తే ఆసక్తికరమైన కథతో పాటు రాహుల్ దర్శకత్వం, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ పనితీరు, నాని – సాయిపల్లవిల అద్భుతమైన నటన, ఎమోషనల్‌తో కూడిన సెకండాఫ్, డైలాగులు, పాటలు, అద్భుతమైన స్క్రీన్‌ప్లే అని చెప్పుకోవాలి. ఇన్ని ప్లస్ పాయింట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు స్లోగా మూవ్ అవ్వడం ఒక్కటే కాస్త మైనస్ అని చెప్పుకోవాలి. అది కూడా కథా నేపథ్యంలో భాగంగానే స్లోగా ఉంటుంది.
ఓవరాల్‌గా చూస్తే శ్యామ్ సింఘా రాయ్ అద్భుతంగా తీసిన ఎమోషనల్ ఫిల్మ్. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు అదిరిపోయే ఓ కవితాత్మక ప్రేమకథను మనకు అందించాడు. ఫ్యామిలీస్‌తో పాటు క్లాస్ సినీ లవర్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత తెలుగులో ఇలాంటి మంచి సినిమా వచ్చింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమా.