మెగాస్టార్ చిరంజీవి – బి.గోపాల్ కాంబినేషన్లో 2002వ సంవత్సరంలో వచ్చిన ఇంద్ర సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటకి వరుస ఫ్లాపులతో ఉన్న చిరంజీవి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఇంద్ర సినిమా చేశారు. అగ్ర నిర్మాత అశ్వినీదత్ – బి.గోపాల్ అప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్నా ఆర్తి అగర్వాల్ – సోనాలి బింద్రే – మణిశర్మ లాంటి సూపర్ కాంబినేషన్ తో ఈ సినిమా వచ్చింది. రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ తెచ్చుకున్న ఇంద్ర అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న పాత రికార్డులకు పాతరేసి 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
ఇక ఈ సినిమా మా స్టోరీ మొత్తాన్ని రచయిత చిన్ని కృష్ణ… దర్శకుడు గోపాల్ కు కాశీలోనే నెరేట్ చేశారట. కాశీ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి… అక్కడ చెపితే ఇంకా బాగా నెరేట్ అవుతుందనే.. చిన్ని కృష్ణ కాశీ వెళ్లి మరీ దర్శకుడు గోపాల్‌కు కథతో పాటు అన్ని సీన్లు వివరించారట. ఫస్టాఫ్ వినేసరికి బి.గోపాల్ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నిర్ణయానికి వచ్చేశారు అట. వెంటనే నిర్మాత అశ్వినీదత్ కి ఫోన్ చేసి మనం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న దత్ గారు అని చెప్పారట.
ఇక సినిమాలో చిరంజీవి మేనల్లుడుని కొడుతున్నప్పుడు సౌకత్ అలీ ఖాన్ పాత్రతో చిరు చెప్పే డైలాగ్ చిరంజీవి స్వయంగా పట్టుబట్టి రాయించుకున్నారు అట, సౌకత్ ఆలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి.. తల దించుకుని వెళ్తున్నాను.. లేకపోతే తలలు తీసుకెళ్లే వాడిని అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.
ఇక సెకండాఫ్ లో చిరంజీవి సింహాసనాన్ని అధిష్టించి ముఖేష్ రుషీతో రాననుకున్నావా… రాలేను అనుకున్నావా అని చెప్పే డైలాగ్ చిరు ఫ్యాన్స్‌కు మాంచి జోష్ ఇచ్చింది. ఈ డైలాగ్‌ను రాత్రి 12 గంటలకు శబ్దాలయ థియేటర్లో ఎడిటింగ్‌లో చూసిన నిర్మాత అశ్వినీదత్ అర్థరాత్రి అయినా అప్పటికప్పుడు చిరంజీవికి ఫోన్ చేసి నిద్ర లేపి మరీ అభినందించారట.
అప్పటకి చిరు నిద్ర పోతుండగా.. ఫోన్ తీసిన చిరు భార్య సురేఖ దత్ గారు ఈ టైంలో ఫోన్ చేశారు.. నిద్ర పోతున్నారు లేపనా ? అని అడగగా.. అశ్వినీదత్ నిద్ర లేపమని మరీ చిరంజీవి గారు సినిమా సూపర్ గా ఉంది అదిరిపోయింది అని మెచ్చుకున్నారట. ఆ రోజుల్లోనే రు. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఇంద్ర రు. 32 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.