Moviesవావ్ కేక పెట్టించారు... బాల‌య్య‌తో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫిక్స్‌

వావ్ కేక పెట్టించారు… బాల‌య్య‌తో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫిక్స్‌

తెలుగు సినిమా ప్రేక్ష‌కుల ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్ వ‌చ్చేసింది. అస‌లు ఈ వార్త మామూలు వార్త కాదు.. పెద్ద సంబ‌ర‌మే చేసుకోవాల్సినంత క్రేజీ అప్‌డేట్‌. టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఒకే వేదిక మీద క‌నిపించ‌బోతున్నారు. అంత‌కు మించిన ఆనందం ఘ‌ట్ట‌మ‌నేని, నంద‌మూరి అభిమానుల‌కు ఏం ఉంటుంది. ఓ వైపు నంద‌మూరి అభిమానులు బాల‌య్య న‌టిస్తోన్న అఖండ సినిమా రిలీజ్ సంబ‌రాల్లో ఉన్నారు. అఖండ ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

ఇప్ప‌టికే సినిమా కు ప్రి రిలీజ్ పాజిటివ్ బ‌జ్ ఉండ‌డంతో నంద‌మూరి అభిమానులు ముందే సంబ‌రాలు షురూ చేసుకుంటున్నారు. ఇదే టైంలో మ‌రో బంప‌ర్ న్యూస్ వ‌చ్చింది. బాల‌య్య హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ లో మ‌హేష్‌బాబు గెస్ట్ గా రానున్నాడ‌ట‌. ఈ అన్‌స్టాప‌బుల్ షోకు ముందు నుంచే సాలిడ్ సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. మోహ‌న్‌బాబుతో చేసిన ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు, ఆత‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నానితో చేసిన రెండో ఎపిసోడ్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో పాటు ఏకంగా మిలియ‌న్ల కొద్ది వ్యూస్ వ‌చ్చాయి.

ఇక మూడో ఎపిసోడ్ బ్ర‌హ్మానందంతో ఉంటుంద‌ని టాక్ వ‌చ్చింది. ఇక మ‌హేష్‌బాబు ఈ షోలో బాల‌య్య‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇది అఫీషియ‌ల్ న్యూస్. ఈ ఎపిసోడ్‌ను డిసెంబ‌ర్ 4న అన్న‌పూర్ణ స్టూడియోలో షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ అదిరిపోయే ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వ‌స్తుందో ? చూడాలి. మ‌రోవైపు మ‌హేష్‌బాబు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు ఎపిసోడ్ కూడా ఆదివారం టెలీకాస్ట్ కానున్న సంగ‌తి తెలిసిందే.

ఇక బాల‌య్య – మ‌హేష్‌బాబు షో అంటే బుల్లితెర‌పై ఇంత‌కు మించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రోగ్రాం మ‌రొక‌టి ఉండ‌ద‌నే చెప్పాలి. ఈ షో తెలుగునాట స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌దీయ‌డం ఖాయం.

Latest news